For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరెరె సెగలు పుట్టిస్తోందే.. ప్రగ్యా జైస్వాల్ దెబ్బకు నెటిజన్లు షాక్!

    |

    కొందరు హీరోయిన్లు తెరపై కనిపించేదానికి సోషల్ మీడియాలో కనిపించేదానికి ఎంతో తేడా ఉంటుంది. అలాంటి వారిలో ప్రగ్యా జైస్వాల్ ముందుంటుంది. తెరపై ఓ మాదిరిగా కనిపించే ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది. హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరిచేస్తుంది. బికినీ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఫిదా చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో అగ్గి రాజేస్తున్నాయి.

     హిట్ అయినా కూడా..

    హిట్ అయినా కూడా..

    కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రగ్యా జైస్వాల్. అంతకు ముందు ఓ సినిమాను చేసినా కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. అలా కంచె సినిమాయే ప్రగ్యాకు రీ ఎంట్రీలా అయిపోయింది. అయితే కంచె సినిమాకు ఎంత మంచిపేరు వచ్చిందో ప్రగ్యాకు కూడా అంతే మంచి పేరు వచ్చింది. ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి.

     కలిసి రాని లక్..

    కలిసి రాని లక్..

    కంచె సినిమా హిట్ అయిన తరువాత మంచి అవకాశాలే వచ్చాయి. ఓం నమో వెంకటేశాయలో అతిథి పాత్ర, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర ఇలా ఏ ఒక్కటి తన సినీ కెరీర్‌ను నిలబెట్టలేకపోయాయి. ప్రగ్యాకు సినిమాల పరంగా ఎలాంటి లక్ కలిసిరాలేదు.

     సోషల్ మీడియాలో వైరల్..

    సోషల్ మీడియాలో వైరల్..

    వెండితెరపై ప్రగ్యా జైస్వాల్ మెరవక పోయినా సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో ప్రగ్యా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గత కొన్ని రోజులుగా ప్రగ్యా హాట్ ఫోటోలతో దాడి చేస్తూనే ఉంటుంది. తాజాగా షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

     బ్లాక్ అండ్ వైట్‌లో..

    బ్లాక్ అండ్ వైట్‌లో..

    బ్లాక్ అండ్ వైట్ తన అందాలను ప్రదర్శించి ప్రగ్యా జైస్వాల్. హాట్ క్లీవేజ్ షోతో మత్తెక్కించే చూపులతో ప్రగ్యా జైస్వాల్ మంట పెడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లందరూ ప్రగ్యా లుక్కుకు పిచ్చెక్కిపోతోన్నారు. హాట్ హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

    English summary
    Pragya Jaiswal Latest Pics Goes Viral, Be my escape from everything my nothing
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X