అలాంటివి వేసుకోవడం ఎందుకు?.. మళ్లీ అలా అడ్డుపెట్టడం ఎందుకు?.. ప్రగ్యా జైస్వాల్ పిక్స్ వైరల్!!
కొందరు హీరోయిన్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఇంకొందరు మాత్రం ఇంట్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనో ఎక్కువగా ఉంటారు. లౌక్యం తెలిసిన కొందరు ముద్దుగుమ్మలకు సోషల్ మీడియాను ఎలా వాడాలో చాలా బాగా తెలుసు. సినిమా అవకాశాలు లేకపోయినా, వెండితెరపై అంతగా మెరవకపోయినా సరే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కాలాన్ని నెట్టుకొస్తారు. క్రిష్ పరిచయం చేసిన అందాల ముద్దు గుమ్మ ప్రగ్యా జైస్వాల్ పరిస్థితి కూడా అలానే ఉంది.

ఆ చిత్రంతోనే..
క్రిష్ సినిమాలో హీరోయిన్ ఎంత పద్దతిగా, ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాపు గీసిన బొమ్మలా, పదహారాణాల తెలుగమ్మాయిల చూపిస్తాడు. ఇక కంచె సినిమా విషయానికొస్తే.. సీతా దేవీ పాత్రలో ప్రగ్యా జైస్వాల్‌ను అద్భుతంగా చూపించాడు. అంతకు ముందు ఓ చిత్రాన్ని చేసినా కూగా ప్రగ్యాకు కంచె మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఫ్లాపులే పలకరించాయి..
కంచె సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యాకు ఆపై సరైన సక్సెస్ అందలేదు. హీరోయిన్‌గా బ్రేక్ ఇచ్చే సినిమాలేవీ ప్రగ్యా దగ్గరకు రాలేదు. ఓం నమో వెంకటేశాయలో అతిథి పాత్ర, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర ఇలా ఏ ఒక్కటి తన సినీ కెరీర్‌ను నిలబెట్టలేకపోయాయి. ఏవీ కూడా తనకు స్టార్డంను తీసుకురాలేకపోయాయి.

సోషల్ మీడియాలో హల్చల్..
అయితే ప్రగ్యా జైస్వాల్ వెండితెరపై అంతగా రచ్చ చేయకపోయినా.. సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది. స్విమ్ సూట్, బికినీ, బీచ్‌లు అంటూ హాట్ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Recommended Video

ఇలా నిద్రలేవలేదు..
వీకెండ్ పైగా సండే.. ఈ టైంలో తన మూడ్ ఎలా ఉందో చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది ప్రగ్యా. ఇందులో ప్యాంట్ గట్రా వంటివి ఏవీ ధరించలేదు. కేవలం టీ షర్ట్ మాత్రమే వేసుకుంది. కానీ ఆ టీ షర్ట్‌ను మాత్రం కింది వరకు లాగేసింది. మొత్తానికి ఇలా తెలివిని ప్రదర్శించి నెటిజన్లకు వేడి పుట్టించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











