స్టార్ హీరోతో ప్రగ్యా జైస్వాల్ రొమాన్స్.. ఇక టాలీవుడ్‌కు దూరమేనా?

అందం, అభినయం ఉన్నా కూడా కొన్నిసార్లు హీరోయిన్ గా ఛాన్స్ రావాలంటే లక్కు కూడా కలిసి రావాలి. అది లేకపోతే ఎన్నాళ్లయినా చిన్న చిన్న పాత్రలు, సెకండ్ హీరోయిన్ ఛాన్స్ లు చేసుకుంటూ ఉండిపోవడమే అవుతుంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒకరోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఎవరు ఏమి చేయలేరు. కానీ, వచ్చిన రోజును మాత్రం ఎవరు ఆపలేరు. ప్రస్తుతం హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది.

కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. సీతగారు.. సీతగారు అంటూ వరుణ్ వెంటపడగానే.. అతడితో పాటు కుర్రకారు కూడా ఆమె వెంటపడడం మొదలుపెట్టారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రగ్యా.. ఆ తరువాత అంతటి విజయాన్ని కానీ, అలాంటి ఛాన్స్ కానీ అందిపుచ్చుకోలేకపోయింది. గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర.. ఇలాంటి సినిమాల్లో నటించింది. అవి ఆమెకు విజయాలను అందివ్వలేదు.. అవకాశాలను అందివ్వలేదు.

Pragya Jaiswal on working in Akshay Kumar s Khel Khel Mein

అయినా కూడా ప్రగ్యా పట్టువిడవని లేడీ విక్రమార్కుడులా టాలీవుడ్ పై పెద్ద యుద్ధమే చేస్తూ వచ్చింది. ఇక ఆ సమయంలోనే వచ్చింది నందమూరి బాలకృష్ణ అఖండ. ఇందులో బాలయ్య సరసన నటించి మెప్పించింది. బోయపాటి సినిమా అంటే.. హీరోయిన్ పరిగెత్తాల్సిందే.. ఏడవాల్సిందే. బాలయ్య పక్కన చిన్నగా ఉన్నా కూడా అమ్మడు నటనలో పరిపక్వత చూపించేసరికి అభిమానులు ప్రగ్యా నటనకు మంచి మార్కులే వేశారు. భారీ విజయం అందుకున్న అఖండలో ప్రగ్యా పాత్ర కూడా కొంత ఉందని చెప్పుకోవచ్చు.

ఇక అఖండ లాంటి హిట్ పడ్డాకా.. అమ్మడిని ఎక్కడ ఆపగలం అని అనుకున్నారు అంతా.. కానీ, ఆడేది జరగలేదు. బ్యాక్ టూ పెవిలియన్ అన్నట్లు మళ్లీ ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉంది. సరే అందం లేదా.. అనే అది కాదు. అభినయం లేదా ..? అందాల ఆరబోత తెలియదా..? అంటే ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్లి అమ్మడి ఫాలోయింగ్ చూస్తే మెంటల్ ఎక్కి పోవాల్సిందే. పాలరాతి శిల్పం లాంటి దేహంతో అమ్మడు అందాల ఆరబోతకు కుర్రకారు కునుకు కూడా తీయనంతగా కుదేలు అయిపోతున్నారు.

Pragya Jaiswal on working in Akshay Kumar s Khel Khel Mein

మరి అయినా ప్రగ్యాను అవకాశాలు ఎందుకు రావడం లేదు అంటే అది పెద్ద మిస్టరీ అనే చెప్పాలి. ఇక టాలీవుడ్ లో పని అయ్యేలా లేదు అనుకోని ప్రగ్యా బాలీవుడ్ బాట పట్టిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రగ్యాకు బాలీవుడ్ ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతుంది.. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట.

తాప్సీ, వాణికపూర్‌తోపాటు ప్రగ్యాజైస్వాల్ మరో హీరోయిన్‌గా కనిపించబోతున్నదని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే అమ్మడు పంట పండినట్టే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పుష్పకు పోటీగా ఆగస్టు 15 న రిలీజ్ కానుంది. ఇందులో ప్రగ్యా పాత్రకు కూడా ప్రాధాన్యత ఉందని అంటున్నారు. మరి ఈ సినిమాతోనైనా ప్రగ్యా హిట్ అందుకుంటుందా.. ? లేక అక్కడ కూడా బోల్తా కొట్టి మళ్లీ టాలీవుడ్ కు వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X