Pragya Jaiswal : అఖండ సౌందర్యం .. పూల పూల లెహంగాలో ప్రగ్యా అందాల అరాచకం

అందం, అభినయం కావాల్సినంత ఉన్నప్పటికీ కొందరు అమ్మాయిలు సినీరంగంలో ఎందుకో అవకాశాలను దక్కించుకోలేక కెరీర్‌లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటారు . సినీ రంగంలో స్థిరపడాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలని పెద్దలు ఎందుకు అన్నారో కొందరి జీవితాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ కోవలోకే వస్తారు అందాల ప్రగ్యా జైస్వాల్. అప్పుడెప్పుడో కంచె సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ మళ్లీ అడ్రస్ లేరు.

1991 జనవరి 12న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు ప్రగ్యా. పూణేలోని ప్రఖ్యాత సింబియాసిస్ లా స్కూల్‌లో న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం మోడలింగ్ వైపు అడుగుపెట్టిన ఈమె.. పలు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొన్నారు. మోడల్‌గా దేశంలోని ప్రఖ్యాత కంపెనీల వాణిజ్య ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో సాధించిన విజయాలు, చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మక సింబియాసిస్ సాంస్కిృతిక్ పురస్కార్‌ను ప్రగ్యా జైస్వాల్ అందుకున్నారు.

Pragya Jaiswal PhotoShoot With printed lehenga Her latest photos here

మోడల్‌గా తానెంటో నిరూపించుకున్న ప్రగ్యా జైస్వాల్ .. నటనపై ఆసక్తితో సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో 2014లో విరుట్టు అనే తమిళ్ సినిమా ద్వారా తొలిసారిగా ముఖానికి రంగేసుకున్నారు. అనంతరం 2015లో బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు ప్రగ్యా . ఈ దశలో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమా ప్రగ్యా జైస్వాల్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. జమీందారు కూతురిగా, పేదింటి అబ్బాయిని ప్రేమించే అమ్మాయిగా మెప్పించారు.

కంచె తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. తన క్యూట్ లుక్స్, నటనతో ఆమె టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అవుతారని అంతా అనుకున్నారు. ఇక టాలీవుడ్ నుంచి పెట్టే బేడా సర్దేసిన సమయంలో బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండతో ఊహించని హిట్ అందుకున్నారు ప్రగ్యా.

ప్రస్తుతం మరోసారి నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న డాకు మహారాజ్‌లో ప్రగ్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డాకు మహారాజ్ కాకుండా మరోసారి బాలయ్యతోనే అఖండ 2, టైసన్ నాయుడు సినిమాలలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. డాకు హిట్ అవుతుందని ప్రగ్యా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా రిజల్ట్ తర్వాత తనకు మరిన్ని అవకాశాలు పోటెత్తుతాయని ప్రగ్యా జైస్వాల్ భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రగ్యా.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా పూల లెహంగాలో ఆమె రీసెంట్‌గా చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం.. మీరూ ఆ అందాలు చూసేయండి.

More from Filmibeat

Read more about: pragya jaiswal movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X