Pragya Jaiswal : పలుచటి చీర కట్టులో క్లీవేజ్ షో .. యెల్లో శారీలో మాయ చేస్తోన్న ప్రగ్యా
అందం, అభినయం పుష్కళంగా ఉన్నప్పటికీ కొందరు ముద్దుగుమ్మలు అవకాశాలను దక్కించుకోవడంలో వెనుకబడుతుంటారు. సినీ రంగంలో స్థిరపడాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలని కొందరు భామలు నిరూపిస్తుంటారు. ఈ కోవలోకే వస్తారు ప్రగ్యా జైస్వాల్. అప్పుడెప్పుడో కంచె సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్య.. ఒకటి ఆరా సినిమాలు తప్పించి పెద్దగా క్లిక్ కాలేదు.
1991 జనవరి 12న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు ప్రగ్య. పూణేలోని ప్రఖ్యాత సింబియాసిస్ లా స్కూల్‌లో న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం 2014లో పలు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొన్న ప్రగ్యా జైస్వాల్ మోడల్‌గా దేశంలోని పలు టాప్ బ్రాండ్స్‌కు ప్రచార కర్తగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో సాధించిన విజయాలకు గాను సింబియాసిస్ సాంస్కిృతిక్ పురస్కార్‌నను ప్రగ్యా జైస్వాల్ అందుకున్నారు.

ఈ క్రమంలో నటనపై ఆసక్తితో సినీరంగ ప్రవేశం చేసిన ప్రగ్యా జైస్వాల్.. 2014లో విరుట్టు అనే తమిళ్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత 2015లో బిగ్‌బాస్ అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో తెలుగువారిని పలకరించారు ప్రగ్య. ఈ క్రమంలో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచెతో ఈ ముద్దుగుమ్మకు బ్రేక్ వచ్చింది. అందులో జమీందారు కూతురిగా, రాయల్ లుక్‌లో కనిపించిన ఈ అమ్మడు అందరి కళ్లలో పడ్డారు. ఈ దెబ్బతో తెలుగులో ప్రగ్యా జైస్వాల్ టాప్ హీరోయిన్ అవుతారని అంతా అనుకున్నారు.
కంచె తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. ఫేడ్ అవుట్ అవుతున్న దశలో బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండతో కమ్ బ్యాక్ ఇచ్చారు ప్రగ్యా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మళ్లీ ఆమె ఒక ఊపు ఊపుతారని అనుకున్నా మరోసారి ఆమె కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న డాకు మహారాజ్‌లో ప్రగ్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డాకు మహారాజ్ కాకుండా అఖండ 2, టైసన్ నాయుడు సినిమాలలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.
ఆల్రెడీ 30 ప్లస్‌లో ఉన్న ప్రగ్యా జైస్వాల్ ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు. అయితే టీమిండియా క్రికెటర్ శుభమన్ గిల్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనిపై మీడియా ఆమెను ప్రశ్నించగా.. శుభమన్ గిల్‌తో డేటింగ్ చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా అని ఆన్సర్ ఇస్తూ తెగ సిగ్గుపడిపోయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రగ్య.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో యెల్లో కలర్ శారీలో ఆమె రీసెంట్‌గా చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం.. మీరూ ఆ అందాలు చూసేయండి.


Click it and Unblock the Notifications











