అఖండలో పవర్ఫుల్ & స్ట్రాంగ్ రోల్.. బాలయ్యాపైనే భారం వేసిన ప్రగ్యా జైస్వాల్
టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అదృష్టం ఏమిటో గాని ఆమెతో దోబూచులాడుతోంది. మంచి కాంబినేషన్లోనే సినిమాలు సెట్టవుతున్నాయి గాని ఆ సినిమాలు అనుకున్నంతగా వర్కౌట్ అవ్వడం లేదు. అప్పుడెప్పుడో కంచె సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ అనంతరం సరైన సక్సెస్ చూడలేదు.
గుంటురోడు, నక్షత్రం, జయజానకి నాయక వంటి సినిమాలు ఏ మాత్రం హెల్ప్ చేయలేదు. ఇక ఆచారి అమెరికా యాత్ర అయితే కనీసం రిలీజ్ అయినట్లు కూడా ఎవరికి తెలియదు.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తన ఆశలన్నీ కూడా అఖండ సినిమాపైనే పెట్టుకుంది. జయజానకి నాయక అనంతరం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మరోసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు.

ఇక ఈసారి కేవలం గ్లామర్ రోల్ కాదని ప్రగ్యా జైస్వాల్ ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చేసింది. సినిమాలో తనది చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ రోల్ అంటూ.. ఎదో నామమాత్రంగా రెండు పాటలో కనిపించే పాత్ర కాదని వివరణ ఇచ్చింది. సినిమా కథలో కూడా తన పాత్రకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందని ఇలాంటి సినిమా ఛాన్సులు చాలా అరుదుగా వస్తాయని కూడా వివరణ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో దాదాపు ప్రగ్యా జైస్వాల్ దే లీడ్ రోల్. సినిమా హిట్టయితే అమ్మడి కెరీర్ కు కాస్త బూస్ట్ దొరికినట్లే అని చెప్పవచ్చు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అలాగే ప్రగ్యా తమిళ్ లో ఇటీవల ఒక ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











