కైపెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. కుర్రకారుకు పిచ్చెక్కించే పోజ్.. ఒంటిపై అదొక్కటే!
'కంచె' భామ ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. అందంతో పాటు అభినయం పరంగా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్న ఈ భామ.. వెండితెరపై ఆశించిన మేర అవకాశాలు పట్టడంలో మాత్రం విఫలమవుతోంది. దీంతో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా చేసుకొని అందాల ఆరబోత షురూ చేసింది. తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ తెగ అట్రాక్ట్ చేస్తోంది ప్రగ్యా జైస్వాల్.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ కుర్రకారు కంటి రెప్ప వాలనీయడం లేదు. కేవలం లో దుస్తులు మాత్రమే ధరించి సన్ సెట్ ఆస్వాదిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కించే పోజ్ ఇచ్చింది ప్రగ్యా. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి గ్లామర్ కిక్కిచ్చాక నెటిజన్లు మాత్రం ఊరుకుంటారా? ఆమె గ్లామర్‌ని వర్ణిస్తూ అబ్బో! అదిరిపోయే కామెంట్లు పెట్టేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆమె తీరు చూస్తుంటే ఆన్‌లైన్ ప్రభంజనం సృష్టించేందుకు రెడీ అయిందని స్పష్టమవుతోంది.

ఇక ప్రగ్యా జైస్వాల్ సినిమాల విషయానికొస్తే.. గతంలో ఓం నమో వెంటేశాయా, గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలు చేసింది. నటనా సామర్థ్యం ఫుల్లుగా ఉన్నా కెరీర్ టర్నింగ్ మూవీ మాత్రం ఆమె ఖాతాలో పడలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంలో ఓ కీలకపాత్రలో ఈమె నటిస్తోందని సమాచారం. ఎలాగూ ఈ జనరేషన్ కు కావాల్సినట్లుగా సెగలు పుట్టించే అందాలు ఆరబోస్తోంది కాబట్టి ఇకనైనా ఆమె కెరీర్ గాడిలో పడుతుందో.. లేదో! చూద్దాం.


Click it and Unblock the Notifications











