టూ పీస్ బికినీలో ప్రగ్యా సోకుల విందు: హాట్ షోతో ఫుల్ మీల్స్ పెట్టేసిందిగా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎందరో హీరోయిన్లు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. మిగిలిన వారిలో చాలా మంది అందం, టాలెంట్ ఉన్నా అంతగా రాణించట్లేదు. దీనికి కరెక్ట్ ఉదాహరణగా నిలిచే వాళ్లలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. నటిగా అన్ని విభాగాల్లోనూ రాణించిన ఈ చిన్నది సరైన అవకాశాలను మాత్రం అందుకోవట్లేదు. ఫలితంగా కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చేసుకుంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోన ఇప్పుడు కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీరే చూసేయండి!

 అప్పుడే ఎంట్రీ.. కంచెతోనే

అప్పుడే ఎంట్రీ.. కంచెతోనే

మోడల్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా తెలుగులోకి వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత 'కంచె' మూవీలో నటించింది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు సొంతమైంది.

ఎన్నో చేసినా.. హిట్లు లేవు

ఎన్నో చేసినా.. హిట్లు లేవు


'కంచె' తర్వాత ప్రగ్యా జైస్వాల్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు భారీగా వచ్చాయి. దీంతో ఈ బ్యూటీ ప్రతి సినిమానూ చేస్తూ వచ్చింది. అలా ఆమె నటించిన చిత్రాల్లో 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు డిజాస్టర్‌గా మిగిలాయి. అయినప్పటికీ ఆమె వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. మొత్తంగా హిట్లు మాత్రం పెద్దగా సొంతం చేసుకోలేదామె.

 బిగ్గెస్ట్ హిట్.. బిగ్గెస్ట్ ఫ్లాప్‌తో

బిగ్గెస్ట్ హిట్.. బిగ్గెస్ట్ ఫ్లాప్‌తో


ఎన్నో చిత్రాల్లో నటించినా సక్సెస్ రేటును అందుకోలేకపోయిన ప్రగ్యా జైస్వాల్.. బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఇది భారీ విజయం సాధించింది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఆమె ఆ తర్వాత 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసింది. కానీ, ఈ చిత్రం మాత్రం భారీ పరాజయం మూటగట్టుకుంది.

చేతిలో ఒక్క మూవీ లేదు

చేతిలో ఒక్క మూవీ లేదు


'అఖండ' వంటి భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్‌కు పెద్దగా ఆఫర్లు రావట్లేదని తెలిసింది. దీనికి కారణం ఆమె ఇప్పటి వరకూ ఒక్క సినిమాను కూడా ప్రకటించకపోవడమే. అయితే, కొద్ది రోజుల క్రితమే ఆమె సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఆ తర్వాత మాత్రం ఈ బ్యూటీ వరుసగా ఫారెన్‌ ట్రిప్‌లకు వెళ్తోంది. ఇలా పర్సనల్ ట్రాప్‌లతోనే సందడి చేస్తోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీ

అక్కడ మాత్రం ఫుల్ బిజీ


చాలా కాలం పాటు ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినా.. ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

గ్లామర్ షో చేస్తోన్న ప్రగ్యా

గ్లామర్ షో చేస్తోన్న ప్రగ్యా


ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ సందడి చేస్తూనే ఉంది. అయితే, అప్పుడప్పుడూ ఈ బ్యూటీ తన అందాచందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది. ఫలితంగా ప్రగ్యా ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకుంటోంది.

టూ పీస్ బికినీలో బ్యూటీ

టూ పీస్ బికినీలో బ్యూటీ

టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె టూ పీస్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లో తెగ రచ్చ చేసింది. ఫలితంగా ఆమె అందాలు మొత్తం చూపరులను ఫిదా చేస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ విపరీతంగా వైరల్‌ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X