Don't Miss!
- News
లోకేష్ ఐరన్ లెగ్- అందుకే తారకరత్నకు గుండెపోటు-రోజా షాకింగ్ కామెంట్స్..
- Finance
Bank Strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి..!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
తల్లి కాబోతున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. భర్త పుట్టిన రోజే గుడ్ న్యూస్
కరోనా సమయంలో వివాహం చేసుకున్న హీరోయిన్లందరూ ఇప్పుడు గర్భవతులు అవుతున్నారు. ఈ మధ్య కాలంలోనే కాజల్ అగర్వాల్ గర్భవతి అయ్యాను అంటూ ప్రకటించగా మరో హీరోయిన్ సంజన కూడా తాను గర్భవతిని అయ్యానని ప్రకటించింది. ఇక బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ కూడా తాను తల్లిని కాబోతున్నానని ప్రకటించింది. ఇప్పుడు వారి బాటలోనే మరో హీరోయిన్ కూడా తను గర్భవతిని అని చెబుతూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

కన్నడ రీమేక్ ద్వారా
బెంగళూరు లోనే పుట్టి పెరిగిన కన్నడ భామ ప్రణీత పోకిరి సినిమా కన్నడ రీమేక్ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దర్శన్ హీరోగా నటించిన ఆ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అదే ఏడాది తెలుగు లో ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత బావ అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఆ సినిమాలు ఏవీ ఆమెకు పేరు తీసుకు రాలేదు.

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో
కానీ అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినా ఆమెకు మంచి క్రేజ్ లభించింది. ఆ తర్వాత రభస సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది., తర్వాత డైనమైట్ అనే సినిమాలో మంచు విష్ణు సరసన హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు మరదలు కూడా కనిపించింది. ఇవేవి ఆమెకు కలిసి రాలేదు చివరికి ఆమె తెలుగులో హలో గురు ప్రేమకోసమే ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించింది.

లాక్ డౌన్ సమయంలో వివాహం
ప్రస్తుతానికి హిందీ సినీ పరిశ్రమ మీద దృష్టిపెట్టిన ఆమె కన్నడలో ఒక సినిమా చేస్తోంది. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసింది అని రెండు ఆమె పేరు తీసుకురాలేదు. ఇక కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు తన భర్త పుట్టిన రోజు నాదే ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించింది. నిజానికి ఆమె నితిన్ రాజు అనే వ్యక్తిని లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకుంది.

ప్రెగ్నెన్సీ రిపోర్ట్ పాజిటివ్
గత ఏడాది మే 31వ తేదీన కుటుంబసభ్యులు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు పెళ్లి పీటలు ఎక్కారు. ఈ విషయాన్ని కూడా సెప్టెంబర్ వరకు ఆమె బయటకి చెప్పలేదు సెప్టెంబర్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ రోజు తన భర్త పుట్టినరోజు కావడంతో ఆమె ఆసక్తికరమైన ఈ విషయాన్ని బయట పెట్టింది. ఈ రోజు మా ఆయన 34 పుట్టినరోజు సందర్భంగా దేవతలు మాకు ఒక బహుమతి పంపించారు అంటూ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ పాజిటివ్ అని చూపిస్తున్న డివైజ్ ఫోటోలను వారు షేర్ చేశారు.

శుభాకాంక్షలు
అయితే కరోనా సమయంలో ప్రణీత సుభాష్ అనేక సేవా కార్యక్రమాల్లో కూడా భాగమయ్యారు. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్లు మాకేం సంబంధం అన్నట్లు ఇంట్లో కూర్చుంటే ఆమె మాత్రం అనేక విరాళాలు ప్రకటించడమే కాకుండా స్వయంగా తాను సహాయ కార్యక్రమాలలో పాల్గొని మంచి పేరు సంపాదించింది. ఆమె తల్లి అవుతుందనే విషయం తెలియడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.