ఇష్టమైన ఫ్రెండ్‌తో గృహ నిర్బంధంలో ప్రణీత.. అమితంగా.. అద్భుత క్షణాలు అంటూ
తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో తనదైన శైలిలో అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న ప్రణీత సుభాష్ రకరకాల వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హిందూ మతం గురించి మాట్లాడుతూ.. ఇతర మతాలకు వ్యతిరేకంగా మాట్లాడటంపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ వివాదాలన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రణీత ఏం చేస్తున్నారంటే..

వివాదాస్పద ట్వీట్‌తో ప్రణీత
కరోనావైరస్ చైనాలో విజృంభిస్తున్న సమయంలో ప్రణీత ఓ ట్వీట్ చేశారు. చైనాతో భూభాగం ఎంతో దూరం లేకపోయినా మన దేశంలో అలాంటి ప్రాణాంతక వ్యాధిని అడ్డుకోవడంలో విజయం సాధించాం. కోట్లాది మంది ప్రజలున్న భారత దేశంలో కేవలం వందల సంఖ్యలోనే కేసులు నమోదు కావడం వెనుక మనం పాటించే సంప్రదాయాలు, అలవాట్లే. హిందూ మతంలో ఉండే ఉత్తమ విలువలే మనల్ని కాపాడాయి అనే విధంగా ట్వీట్ చేశారు.

వారికి నవ్వులాటగా ఉండేది
మన ఆచారాలు, సంప్రదాయాలే మనకు శ్రీ రామరక్షగా మారాయి. మనం నమస్తే పెడితే వాళ్లు నవ్వారు. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్లు చేతులు కడుక్కోవాలంటే.. అలాగే జంతువులను పూజించాలింటే.. మొక్కలను నాటాలంటే.. శాఖాహారం తినాలని చెప్పినప్పుడల్లా ప్రతీసారి నవ్వారు. ఇప్పుడు కరోనా నుంచి కాపాడటంలో అవన్నీ మనకు రక్షణగా నిలిచారు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

హిందూ మతాన్ని స్వీకరించమని చెప్పలే
అయితే ప్రణీత చేసిన ట్వీట్ వివాదంగా మారినప్పటికీ.. ఆమె భావనలో ఉండే సదుద్దేశాన్ని కొందరు ప్రశంసించారు. మంచిని చెప్పే ఎజెండాలో ఆరోగ్యం, ఉత్తమ జీవన విధానం ఉందని ఆమెను ప్రశంసించారు. ఇలా వస్తున్న ప్రశంసలపై స్పందిస్తూ.. నేను హిందూ మతాన్ని స్వీకరించాలని బలవంతం చేయడం లేదు. అందులోని మంచి విషయాలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నించాను అని అన్నారు.

గృహ నిర్బంధంలో
ప్రస్తుతం ప్రణీత సుభాష్ స్వీయ గృహ నిర్బంధంలో సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తన విలువైన సమయాన్ని అప్తులకంటే ఎక్కువగా ప్రేమించే పెంపుడు కుక్కతో గడుపుతున్నారు. నాకు ఇష్టమైన నా పెంపుడు కుక్కతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించిందంటూ ప్రణీత చెప్పారు.
Recommended Video

అజయ్ దేవగన్‌తో కలిసి
కన్నడ, తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించిన ప్రణీత సుభాష్ ఇప్పుడు బాలీవుడ్ పరిశ్రమపై కన్నేశారు. అజయ్ దేవగన్‌తో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అజయ్ దేవగన్ నటిస్తున్న హంగామా2, భుజ్ చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











