twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మతం పేరుతో ప్రణిత ట్వీట్.. దేశాన్ని విడదీయకు.. విరుచుకుపడ్డ నెటిజన్లు

    |

    కరోనావైరస్ భయాలు వెంటాడుతుండటంతో ఏదో ఓ రకంగా సెలబ్రిటీలు తమ ట్వీట్లతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో తమకు తోచిన విధంగా సలహాలు, సూచనలతో ఆకట్టుకొంటున్నారు. తాజాగా కరోనాపై అందాల తార ప్రణిత సుభాష్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. అత్యుత్సాహంతో పెట్టిన పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్లతో ప్రణితపై దాడికి దిగినంత పనిచేశారు. ఇంతకు ప్రణిత చేసిన ట్వీట్ ఏమిటంటే..

    హిందూ సంప్రదాయాలే

    హిందూ సంప్రదాయాలే

    కరోనావైరస్ వ్యాప్తిపై స్పందిస్తూ ప్రణిత ట్వీట్ చేసింది. చైనాతో భారత సరిహద్దు దగ్గరైనప్పటికీ.. దేశంలో కరోనావైరస్ అంతగా విస్తరించలేదు. అందుకు కారణం మన సంప్రదాయాలు, అలవాట్లే కారణం. మనం పాటించే ఆరోగ్య సూత్రాలు, పుష్టికరమైన ఆహారమే కాపాడింది. హిందూ సాంప్రదాయాలే కీలక పాత్ర పోషించాయనే విధంగా ట్వీట్ చేసింది.

    ఇతర మతస్తుల ఆచారాలు మంచివి కాదా?

    ఇతర మతస్తుల ఆచారాలు మంచివి కాదా?

    అయితే ప్రణీత ట్వీట్‌పై ప్రతికూలంగా స్పందించారు. హిందూ మతం తప్ప.. మరో మతస్థులు ఆరోగ్య సూత్రాలు పాటించారా? వారి సంప్రదాయలు మంచివి కాదా? వారు శుచి, శుభ్రతతో ఉండరా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు లెవనెత్తారు. మతాన్ని ఇలాంటి వ్యాధులను అంటగట్టకూడదనే విధంగా హితవు పలికేందుకు నెటిజన్లు ప్రయత్నించారు.

     భారతీయుల జీవన విధానం

    భారతీయుల జీవన విధానం

    ప్రణీత ట్వీట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. భారతీయులు జీవించే విధానం గొప్పది. వారు అనుసరించే పద్ధతులు ఆరోగ్యవంతంగా ఉంటాయి. కానీ హిందూ మతం వల్లే అనే విధంగా ట్వీట్లు చేయడం సరికాదు. మతాన్ని ఇలాంటి అంశాల్లోకి లాగడం సరికాదు అని నెటిజన్ అభిప్రాయపడ్డారు.

    మతం పేరుతో విడదీయవద్దు

    మతం పేరుతో విడదీయవద్దు

    కరోనావైరస్ దేశంపై ప్రభావం చూపకపోవడానికి కేవలం హిందూ మతమే కాదు. భారతీయ సంస్కృతి ప్రధాన కారణం. దేశాన్ని మతం పేరుతో విడదీయవద్దు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కుల, మతాలకు తావులేదనే విధంగా ఓ నెటిజన్ సలహా ఇచ్చారు.

    నా మతం అలా నేర్పింది

    నా మతం అలా నేర్పింది

    నేను హిందువు కాకపోయినా.. నా పేరు, అస్థిత్వానికి భిన్నంగా ఉండాలని నా మతం నాకు నేర్పింది. నమస్తే, చేతులు కడుక్కోవడం లాంటి పనులు కరోనాను నిలువరించలేవు. కొవిడ్19కు సాంస్కృతిక వ్యత్యాసాలు లేవు. నిన్ను నీవు రక్షించుకోవడానికి అనవసరపు వాదనలు తెరపైకి తీసుకురావొద్దు అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఇలా నెటిజన్లు విరుచుకుపడిన నేపథ్యంలో ప్రణీత స్పందించకపోవడం గమనార్హం.

    Recommended Video

    Hello Guru Prema Kosame Movie Success Meet
     బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం

    బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం

    ఇక ప్రణీత కెరీర్ విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించే హంగామా 2 చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. శిల్పాశెట్టి, పరేశ్ రావెల్, మీజాన్ జాఫ్రీతో కలిసి కనిపించబోతున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్నది.

    English summary
    Pranitha Subhash controversial tweet on Coronavirus scare. He tweeted that Despite the geographical proximity to China, India has very few cases per million of #Covid19. Like it or not, our habits, traditions play an important role in health and hygiene. #Hinduism.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X