twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది జరిగినప్పుడు నేను పుట్టనే లేదు.. రామ్ మందిర్ భూమి పూజపై ప్రణీత ఎమోషనల్

    |

    ఎన్నో యేళ్ల కలల సాకారం, ఎన్నో యేళ్ల పోరాటం నేటికి ఫలించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సర్వం సిద్దమైంది. రాముని జన్మ స్థలంలో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా నవ నిర్మాణాన్ని చేపట్టబోతోన్నారు. నేడు రామ మందిరాని భూమి పూజ జరుగుతోంది. ఈ వేడుకను భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆనందంతో వీక్షిస్తున్నాయి. నేడు ప్రధాని మోడీ నిర్మాణాన్ని మొదలు పెడతారు. ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలు మహదానందంగా వీక్షిస్తున్నారు.

    అయోధ్యలో రాముని గుడి కట్టాలన్నిది యేళ్లనాటి సంకల్పం. దీనికి ముందడుగు నాడు అద్వాణీ చేపట్టిన రథయాత్రతో పడింది. ఆ సమయంలో జరిగిన అల్లర్లు, గొడవలు అందరికీ తెలిసిందే. అనేక వాదోపవాదాల తరువాత నేటికి రాముని గుడి కట్టేందుకు అన్ని అవాంతరాలు తొలిగిపోయాయి. ప్రపంచం ఆశ్చర్యపోయేలా రాముని గుడిని అద్భుతంగా నిర్మించబోతోన్నారు. ఈ సందర్భంగా ప్రణీత ఎమోషనల్ అయింది.

     Pranitha Subhash Emotional On Ram Mandir Bhumi Puja

    ప్రణీత అయోధ్య రామ మందిర భూమిపూజ కార్యక్రమంపై స్పందిస్తూ.. 'హిందువులనందరినీ ఏకం చేసేందుకు చేపట్టిన రథ యాత్ర జరిగినప్పుడు నేను ఇంకా పుట్టనే లేదు. కానీ ఇప్పుడు ఓ ధార్మిక హిందువునని చెప్పుకునే గుర్తింపు కలిగింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఘట్టం వచ్చింది. మనం కోల్పోయిన వారసత్వ సంపదను మళ్లీ తిరిగి తీసుకు రావడంతో అద్భుతమైన అడుగు వేశాం. జై శ్రీరామ్' అంటూ ఎమోషనల్ అయింది.

     Pranitha Subhash Emotional On Ram Mandir Bhumi Puja

    English summary
    Pranitha Subhash Emotional On Ram Mandir Bhumi Puja. When RathYatra took place uniting all Hindus, I wasn’t even born yet. Today, I feel like I have inherited an identity, one that dharmic Hindus like us were shy of embracing for a very long time. RamMandir Bhoomi Pooja is a modest attempt to reclaim our lost heritage JaiShriRam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X