మిలియన్ సైన్యం.. హీరోయిన్ ప్రణీత క్రేజ్
హీరోయిన్ ప్రణీత ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. సినిమాలతో బిజీగా లేకపోయినా తెలుగులో ఒక్క అవకాశం కూడా రాకపోయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. లాక్డౌన్, కరోనా సమయంలో ప్రణీత చేసిన సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. లాక్డౌన్ కంటే ముందుగా ప్రణీతను అందరూ ఓ హీరోయిన్‌గానే చూశారు. కానీ ఆమె మంచిదనం తెలిశాక, ఆమె సేవాగుణం చూశాక అందరూ ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టేశారు.
లాక్డౌన్‌లో అన్నం కోసం అలమటించిన అందరికీ ప్రణీత ఆహారాన్ని అందించింది. అవసరమైన వారికి చేతనైన సాయం చేశారు. అలా ప్రణీత గురించి తెలిసిన వారంతా ఆమెను ఫాలో అవ్వడం, అభిమానించడం ప్రారంభించారు. ఇక సోషల్ మీడియాలో ప్రణీతకు రోజురోజుకూ ఫాలోయింగ్ పెరుగుతూనే వస్తోంది. అలా తాజాగా ట్విట్టర్‌లో మైల్ స్టోన్‌ను అందుకున్నారు.

తాజాగా ప్రణీతకు ట్విట్టర్‌లో మిలియన్ మార్క్‌ను చేరుకున్నారు. మిలియన్ సైన్యం అవ్వడంతో అందరికీ థ్యాంక్స్ చెప్పింది ప్రణీత. ఇక ప్రణీతకు ఇప్పుడు కన్నడలో మాత్రం అవకాశాలున్నాయి. తెలుగులో ప్రణీత చివరగా హలో గురు ప్రేమ కోసమే సినిమాలో కనిపించింది. శాండిల్ వుడ్‌లో ప్రణీతకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రణీతకు ఫేస్ బుక్‌లో 11 మిలియన్ల మంది.. ఇన్ స్టాలో 4.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.


Click it and Unblock the Notifications











