Sam Divorce: మా రిలేషన్ చైతూకి తెలుసు.. నోరు విప్పితే బాగుండేది.. చంపేస్తామంటున్నారు.. జుకల్కర్ సంచలనం!

సమంత, నాగచైతన్య విడాకులు ప్రకటన తర్వాత ఇప్పటికీ ఆ వార్తలు ఆగడం లేదు. వారి విడాకులు ప్రకటన తర్వాత రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ట్రోలింగ్ మీద నేరుగా సమంత స్పందించింది కూడా. అయితే సమంతతో ఎఫైర్ ఉందని ప్రచారం జరుగుతున్నా ప్రీతమ్ జుక్కల్కర్ ఈ విషయం మీద స్పందించాడు. ఈ విషయం మీద నాగచైతన్య నోరువిప్పి మాట్లాడకపోవడం తనను చాలా బాధించిందని చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే

 ఇష్టం వచ్చినట్టు

ఇష్టం వచ్చినట్టు

అక్కినేని, నాగచైతన్య సమంత ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు గానీ ఈ జంట విడిపోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి నాగచైతన్య అభిమానులు అక్కినేని అభిమానులు సమంత తప్పు అన్నట్లు గా మాట్లాడుతున్నారు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. సమంత చేసిన పని వల్లే ఇలా జరిగిందని కామెంట్లు చేస్తున్నారు.. కొంతమంది సమంతకు పిల్లలను కనడం ఇష్టం లేదు అందుకే విడిపోయారు అంటుంటే కొంతమంది ఏకంగా సమంత ప్రీతం జుకల్కర్ అనే వ్యక్తితో ఎఫైర్ నడుపుతోందని అందుకే విడాకులు వచ్చాయి అని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.

ఎట్టకేలకు ప్రీతం జుకల్కర్

ఎట్టకేలకు ప్రీతం జుకల్కర్

నిజానికి సమంతకు ప్రీతం ఐ లవ్ యు అంటూ ఒక సందర్భంలో విష్ చేయడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది. ఇక ఈ విషయం మీద సమంత నేరుగా స్పందించకపోయినా తన విడాకుల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి అవి నిజం కాదని ఆమె చెప్పుకొచ్చింది. ఇదే విషయం మీద ప్రీతం జుకల్కర్ ఎట్టకేలకు స్పందించాడు. సమంత నేరుగా స్పందించకపోయినా తనకు బాధ అనిపించలేదు కానీ నాగచైతన్య సైలెంట్ గా ఉండటమే తనకు ఎక్కువ బాధ పెడుతుందని ప్రీతం జుకల్కర్ చెప్పుకొచ్చాడు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రీతం తన బాధను ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు.

ఐలవ్యూ చెప్పకూడదా?

ఐలవ్యూ చెప్పకూడదా?

సమంతను నేను జీజీ (అంటే నార్త్ ఇండియాలో సోదరిని అలా పిలుస్తారు) అని పిలుస్తాను అనే విషయం అందరికీ తెలుసని అలాంటప్పుడు మా ఇద్దరి మధ్య లింక్ పెట్టాలని ఎలా అనిపించింది అని ఆయన ప్రశ్నించారు. కొంతమంది ఆమెకు ఐ లవ్ యు ఎలా చెబుతావు అని అడుగుతున్నారని ఒక స్నేహితుడికి , స్నేహితురాలికి, సోదరికి ఐలవ్యూ చెప్పకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే విడాకుల కారణంగా చాలా బాధ అనుభవిస్తున్న ఒక స్త్రీని ఇలాంటి అనవసరమైన పుకార్లతో ఇంకెంత బాధ పెడతారని ఆయన ప్రశ్నించారు. తనకు సమంతతో పాటు నాగచైతన్య కూడా కొన్నేళ్ల క్రితం నుంచే పరిచయం అని పేర్కొన్న ప్రీతం తనకు సమంతకు మధ్య ఎలాంటి బంధం ఉందనే విషయం నాగచైతన్యకు బాగా తెలుసని అన్నారు..

 నాగచైతన్య మాట్లాడుతాడనుకున్నా

నాగచైతన్య మాట్లాడుతాడనుకున్నా

చాలామంది నా గురించి సమంత గురించి తప్పుగా మాట్లాడుతున్న సమయంలో నాగచైతన్య గురించి ఒక్క మాట అయినా మాట్లాడుతాడు అని అనుకున్నాను అని, మా గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చినా చాలా బాగుండేదని ప్రీతం చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ అభిమానులు ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారో వారందరూ కూడా నాగచైతన్య అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే వెనక్కి తగ్గే వారని అన్నారు. అలాగే ఈ ట్రోల్స్ అన్నీ చూస్తుంటే తనకు భయం వేస్తోందని పేర్కొన్న ఆయన నన్ను చంపేస్తారని కూడా చాలామంది బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చాడు

చంపేస్తామని బెదిరింపు

చంపేస్తామని బెదిరింపు

నా ఇన్ బాక్స్ లు అన్నీ కూడా బూతులతో కూడిన బెదిరింపులు అలాగే చంపేస్తామని బెదిరింపులతో నిండి పోయాయి అని ఇవన్నీ ఎవరో తెలియని వ్యక్తులే చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కొంతమంది నా కెరీర్ నాశనం చేస్తామని బెదిరిస్తుంటే, మరి కొంత మంది మా ఇంటి నుంచి అడుగు బయట పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఇక ఇదంతా చూసి మా అమ్మ చనిపోయింది అని కూడా కొన్ని వెబ్ సైట్స్ వాళ్ళు రాసుకొచ్చారు అని ఆమె చాలా ఆరోగ్యంతో ఉన్నారని ప్రీతం చెప్పుకొచ్చాడు.. కొద్దిరోజుల మసాలా కోసం జీవితాలను నాశనం చేయడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు.. ఇంత జరుగుతున్నా నేను వెనకడుగు వేసేది లేదు, నేను నా సోదరి, స్నేహితురాలైన సమంత కోసం ఏం చేయడానికైనా సిద్ధం, ఆమె వెనకనే అండగా ఉంటాను నేను ఇలాంటి ట్రోల్స్ కి భయపడను అని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Hero Harsha Narra Making Fun Of Team In Bus Tour | Missing Movie
సాధన సింగ్ కూడా

సాధన సింగ్ కూడా

ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకోగా సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ కూడా ఈ విషయం మీద స్పందించింది. ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉందని భవిష్యత్తులో నాకు నా సోదరుడికి కూడా లింకు పెట్టి ఏమైనా చేయడానికి ఈ సమాజం సిద్ధంగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తం మీద ఇప్పటిదాకా ఈ ప్రచారాలు జరుగుతూ రాగా సమంత, ప్రీతం స్టేట్మెంట్స్ తో అయినా ఈ ట్రోలింగ్ ఆగుతుందని ఆశిస్తున్నారు. ఇక సమంత విడాకుల ప్రకటన తర్వాత కూడా ఎక్కడా అధైర్య పడకుండా వరుస సినిమాలు చేయడానికి ప్లాన్ సిద్ధం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X