twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గర్భం దాల్చిన హీరోయిన్.. బాయ్ ఫ్రెండుతో రహస్యంగా పెళ్లి?

    |

    బాలీవుడ్లో క్యాష్, ఐ హేట్ లవ్ స్టోరీస్, దేశీ బాయ్స్, గ్రాండ్ మస్తీ, మస్తీ జాదె, జైహో చిత్రాలతో పాటు తమిళంలో బిల్లా 2లో నటించిన బ్రూనా అబ్దులా తన బాయ్ ఫ్రెండ్ అలెన్ ఫ్రాసర్ కారణంగా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆమె కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

    ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ ఫేజ్ ఎంజాయ్ చేస్తున్న బ్రూనా అబ్దుల్లా... ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. థాయ్‌లాండ్ వీరి వివాహం జరిగినట్లుగా చర్చించుకుంటున్నారు.

    థాయ్‌లాండ్ వెకేషన్లో ఊహించని నిర్ణయం

    థాయ్‌లాండ్ వెకేషన్లో ఊహించని నిర్ణయం

    బ్రూనా అబ్దుల్లా తన బేబీ మూన్ ఎంజాయ్ చేయడానికి అలెన్ ఫ్రాసన్‌తో కలిసి థాయ్‌లాండ్ వెకేషన్ వెళ్లింది. అయితే ఈ ట్రిప్ కాస్త ఊహించని విధంగా స్పెషల్ ట్రిప్‌గా మారిందని, ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్లు టాక్. అయితే వారు ప్లాన్ చేసుకుని పెళ్లి చేసుకోలేదని, ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

    ఎలాంటి ప్రకటన చేయని బ్రూనా అబ్దుల్లా

    ఎలాంటి ప్రకటన చేయని బ్రూనా అబ్దుల్లా

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్రూనా తమ పెళ్లి విషయమై ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. తన ప్రెగ్నెన్సీకి సంబందించిన ఫోటోలు మాత్రం తరచూ అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఆమె 27 వారాల గర్భవతి.

    పెళ్లికి ముందే గర్భం.. బాలీవుడ్లో కామన్ అయిపోయింది

    పెళ్లికి ముందే గర్భం.. బాలీవుడ్లో కామన్ అయిపోయింది

    పెళ్లికి ముందే ప్రియుడితో గర్భం దాల్చడం లాంటివి ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు... శ్రీదేవి లాంటి వారు సైతం ఇదే పద్దతి అనుసరించారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ధోరణి బాలీవుడ్లో మరింత పెరిగిందనే చెప్పాలి. అమీ జాక్సన్ సైతం ప్రస్తుతం ఇదే పద్దతిలో గర్భం దాల్చిన సంగతి తెలిసిందే.

    అర్జున్ రాంపాల్, గాబ్రియేలా

    అర్జున్ రాంపాల్, గాబ్రియేలా

    మరో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సైతం తన గర్ల్ ఫ్రెండ్ గాబ్రియేలాను గర్భవతిని చేశాడు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి ఉంటుందో? బాలీవుడ్ సినీ తారలు ఈ చర్యల ద్వారా భారతీయ సంస్కృతిలోకి పాశ్చత్య పోకడలు జోప్పిస్తున్నారనే విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే.

    English summary
    Bollywood source said that, Bruna Abdullah has reportedly got married in secrecy to her fiancé Allan Fraser. She is 27 weeks pregnant now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X