twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రైతుగా మారిన ప్రీతి జింటా.. ఆర్గానిక్ ఫార్మింగ్‌తో.. వీడియో వైరల్

    |

    లాక్‌డౌన్ జీవితం ప్రతీ ఒక్కరిని ప్రకృతిపై దృష్టి పెట్టేలా చేసింది. గత మూడు, నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు తమకు నచ్చిన పనులపై దృష్టిపెట్టి ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యారు. ఇక ప్రీతి జింటా ఫ్యామిలీ సభ్యులు కూడా ఇంటి పంటపై దృష్టిపెట్టారు. ఇంటి పెరట్లో సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుట్టి కూరగాయలను పండిస్తున్నారు. ఆ విషయాన్ని తాజాగా ప్రీతి జింటా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళితే..

    ఇంటికి సరిపడా కూరగాయలు

    ఇంటికి సరిపడా కూరగాయలు

    నా జీవితంలో అమ్మ పోషించిన పాత్రను మాటల్లో చెప్పలేను. ప్రతీ అడుగునూ చేతిని పట్టుకొని నడిపించినట్టుగానే అమ్మ ఇంట్లో కూరగాయలను ఎలా పడించవచ్చో నేర్పించింది. అమ్మ సూచనలు, సలహాలతో ఇంటి పంటకు శ్రీకారం చుట్టాను. ఇప్పుడు నా ఇంటికి కావాల్సిన కూరగాయాలను నేను పండించుకొంటున్నాను అని ప్రీతీ జింటా తెలిపారు.

    అమ్మ స్ఫూర్తితో ఇంటి పంట

    అమ్మ స్ఫూర్తితో ఇంటి పంట

    నా ఇంటి పంట ఇదే. ఇంట్లోనే సొంతంగా వెజిటెబుల్స్ పండిస్తున్నాను. అందుకు నా తల్లికి రుణపడి ఉంటాను. సొంతంగా కూరగాయలను ఎలా పండించుకోవచ్చనే విషయాన్ని నాకు నేర్పించారు. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం గురించి పూర్తిగా తెలుసుకొన్నాను. అమ్మ ఇచ్చిన స్ఫూర్తితోనే ఇంటిపంటలో సంతోషాన్ని పొందుతున్నాను అని ప్రీతి జింటా ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో తెలిపారు.

    కాప్పికమ్ తెంపుతూ వీడియో

    కాప్పికమ్ తెంపుతూ వీడియో

    ఇంటి పంట పండించడమే కాకుండా ఇప్పుడు నేను ప్రకృతికి, భూమాతకు చేరువయ్యాను. దీంతో ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతుంది. ఇదిగో నా ఇంటిలో పండిన కాప్సికమ్ వాటిని తెంపుతూ ప్రీతి జింటా ఓ వీడియోను పోస్టు చేశారు. జైమాతాది, సేంద్రియ వ్యవసాయం, షిమ్లా మిర్చి, టింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టును పెట్టి ఆనందం వ్యక్తం చేసింది.

    ఆరు నెలల తర్వాత మేకప్‌తో

    ఆరు నెలల తర్వాత మేకప్‌తో

    ఇక వ్యక్తిగత విషయాలే కాకుండా ప్రొఫెషనల్ విషయాల్లో కూడా ప్రీతి జింటా దూసుకెళ్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత అందరి కంటే ముందుగా షూటింగులో పాల్గొన్నారు. ఇటీవల షూటింగ్ కోసం మేకప్ వేసుకొంటూ తీసిన వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆరు నెలల తర్వాత మళ్లీ షూటింగ్ కోసం మేకప్ వేసుకోవడం హ్యాపీగా ఉంది అని ప్రీతీ జింటా అన్నారు. ప్రీతి జింటా 2018లో నీరజ్ పాథక్ యాక్షన్ కామెడీ భయ్యాజీ సూపర్ హిట్ అనే సినిమాలో చివరిసారిగా కనిపించారు.

    Recommended Video

    Anchor Suma Kanakala In Allu Arjun's Movie, Pushpa Unit Reacts
    టెర్రస్ గార్డెన్‌తో సమంత అక్కినేని

    టెర్రస్ గార్డెన్‌తో సమంత అక్కినేని

    ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌లో సినీ తారలు కొందరు సేంద్రియ వ్యవసాయంపై దృష్టిపెట్టారు. సమంత అక్కినేని కూడా రైతుగా మారారు. తన ఇంటిపై టెర్రస్ గార్డెన్‌ను డెవలప్‌చేసి ఇంటికి సరిపడే కూరగాయలను పండిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ఇంటి పంట గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టును పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

    English summary
    Bollywood actress Preity Zinta had a steps into organic farming in lockdown. Preity sharing a video in her instagram by plucking homegrown capsicums. She wrote that Ghar ki kheti 🤩 How awesome to grow our own vegetables at home. Thank you Ma 🙏 for teaching me & for inspiring me to grow our own vegetables. I’m on top of the world right now, yet I’ve never felt so close to Mother Earth ❤️ #Jaimatadi #organicgardening #shimlamirchi #Ting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X