వైరల్ అవుతున్న ప్రీతిజింతా ఫోటో.. క్రికెట్ అంటే పిచ్చి!

ప్రీతి జింతా తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. ప్రీతి హాకీ స్టిక్ పట్టుకుని ఉన్న పాత ఫోటోని షేర్ చేసింది. ఈ ఫొటోకు ప్రీతి జింతా పెట్టిన క్యాప్షన్ కూడా అందరిని ఆకర్షిస్తోంది. జీవితంలో ఏదైనా స్థిరంగా ఉంది అంటే అది మార్పు మాత్రమే అని ప్రీతీ జింతా పేర్కొంది. ఒకప్పుడు హాకీ నేర్చుకోవాలని చాలా కష్టపడ్డాను అని ప్రీతి తెలిపింది. కానీ హాకీ నేర్చుకోలేకపోయాను. హాకీ అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు క్రికెట్ అంటే పిచ్చి అభిమానం ఏర్పడిందని ప్రీతీ చెబుతోంది.

క్రికెట్ అంటే అభిమానం ఏర్పడడం మాత్రమే కాదు. ఏకంగా ఓ జట్టుకు సహ ఓనర్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రీతీ జింతా ప్రస్తుతం ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు కో ఓనర్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తన జట్టు ఆడిన ప్రతి మ్యాచ్ లో ప్రీతి జింతా కనిపిస్తూ ఉంటుంది. ఓ అభిమానిలాగా కేరింతలు కొడుతూ, ఓడిపోయినప్పుడు భాదపడుతూ ప్రీతి కనిపించడం చూస్తూనే ఉన్నాము.

Preity Zinta looks like a seasoned hockey player in this throwback picture

సినిమాలకు దూరమైన తర్వాత ప్రీతీ జింతా ఇలా ఐపీఎల్ కో ఓనర్ గా వ్యాపారంలో రాణిస్తోంది. కానీ పంజాబ్ జట్టు ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ గెలుచుకోలేకపోవడం విశేషం. ఆ జట్టు బలంగా ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదు. ప్రీతీ జింతా పోస్ట్ కు అభిమానులు కూడా స్పందిస్తున్నారు. కాలం మారింది కానీ మీరు మాత్రం మారలేదు. క్రికెట్ జట్టుకి ఓనర్ గా మారి తమకు వినోదాన్ని అందిస్తున్నందుకు థాంక్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X