సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం.. సీక్రెట్ డేట్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ..
Preity Zinta -Salman Khan: ఇండియన్ సినిమా హిస్టరీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు పొందిన నెంబర్ వన్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఈ కండల వీరుడు 59 ఏండ్లు పూర్తి చేసుకున్న ఇంకా పెళ్లి కాకుండా స్టిల్ బ్యాచిలర్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అయితే తరచూ ఎవరో ఒకరితో రిలేషన్ లో ఉన్నారంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారతారు. ఆయన తన మూడు దశాబ్దాల యాక్టింగ్ కెరీర్ లో ఎంతోమంది నటీమణులతో లవ్ ట్రాక్ కొనసాగించినట్లు టాక్ గట్టిగానే వినిపిస్తుంది. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ని మీరు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేశారా? అని ప్రశ్నించగా ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏం రిప్లై ఇచ్చింది? ఆమె సమాధానమేంటో ఓ లుక్కేయండి.
సల్మాన్ ఖాన్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఆయన ఎంత సీక్రెట్ గా ఉన్న ఆయన విషయాలు బయట పడుతూనే ఉంటాయి. అందులో ఆయన ప్రేమ వ్యవహారాలు అయితే చాలానే లీకయ్యాయి. స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తో లవ్ ట్రాక్ గట్టిగానే నడిపినట్లు బాలీవుడ్ లో భారీ టాక్ ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో కూడా కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించినట్లు టాక్ ఉంది. ఇలా పలువురు హీరోయిన్లతో సల్మాన్ ఖాన్ ప్రేమాయణం కొనసాగించినట్లు పలు రూమర్స్ ఉన్నాయి.

ఇదెలా ఉంటే.. ఇటీవల సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్ తో తాను ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే సల్మాన్ ఖాన్ అంటూ రాసుకోచ్చింది. అయితే ఈ పోస్ట్ పై ఓ అభిమాని స్పందిస్తూ.. సల్మాన్ ఖాన్ తో ఎప్పుడైనా డేటింగ్ చేశారా? అంటూ నటిని ప్రశ్నించారు. దీంతో ఈ ప్రశ్న వైరల్ గా మారింది. ఆ ప్రశ్న ప్రీతి జంట కంటపడడంతో ఆమె కూడా స్పందించింది.
'మేమిద్దరం అసలు డేట్ చేయలేదు. సల్మాన్ ఖాన్ నా కుటుంబంలో సభ్యులు లాంటివాడు. నా భర్త కూడా మంచి స్నేహితుడు. నా సమాధానం కొందరికి ఆశ్చర్యం కలిగించేలా ఉండవచ్చు. అలాంటివారు నన్ను క్షమించండి' అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. సల్మాన్ ఖాన్ ప్రీతి జింటా చాలా సినిమాలలో కలిసి నటించారు. వారిద్దరూ హర్ దిల్ జో ప్యార్ కరేగా, చోరీ-చోరీ, చుప్కే-చుప్కే, దిల్ నే జిసే అప్నా కహా, జాన్ ఇ మాన్, హీరోస్ వంటి సినిమాలలో నటించారు.


Click it and Unblock the Notifications











