మమిత బైజు అందాల ఆరబోత.. ఓనమ్ రోజున సొగసుల జాతర

తెలుగువారికి సంక్రాంతి ఎలాగో.. మలయాళీలకు ఓనం అలా. మలయాళీ క్యాలెండర్‌లోని మొదటి నెల చింగం మాసంలో ఓనమ్ వస్తుంది. వ్యవసాయం, గ్రామాలతో ముడిపడిన పండుగే ఓనమ్. ఆ రోజున ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారైనా సరే ఓనమ్ జరుపుకోవాల్సిందే. వీలున్నవారు ఖచ్చితంగా తమ సొంత గ్రామాలకు వచ్చి ఆత్మీయుల మధ్య పండుగను సెలబ్రెట్ చేసుకుంటారు. కేరళకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ

ఇదిలాఉండగా.. ఏళ్లకు ఏళ్లు సినీ పరిశ్రమలో ఉన్న రాని ఫేమ్ కొందరికి ఒకే ఒక్క సినిమాతో వస్తుంది. రాత్రికి రాత్రే వీరు స్టార్‌గా అవతరిస్తారు. ఇలాంటి వారిలో ఒకరు కేరళ కుట్టి మమిత బైజు
అలా ఒకే ఒక్క సినిమాతో మాయ చేసి కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్నారు మమితా . రీసెంట్‌గా విడుదలైన ప్రేమలు సినిమా సంచలన విజయం సాధించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది. కథ , స్క్రీన్‌ప్లే , మాటల కంటే మమతిను చూడటానికే కుర్రకారు థియేటర్లకు పోటెత్తారు.

premalu fame mamitha baiju onam celebrations photos goes viral

ప్రేమలులో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువతకు గిలిగింతలు పెట్టింది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు స్ట్రెయిట్ మూవీలో నటించకపోయినా ఈ డబ్బింగ్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఈ సినిమా చూసిన యువత మమతి కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రేమలు ప్రమోషన్స్ సమయంలో మమిత పాత వీడియోలు, రీల్స్, డ్యాన్స్ క్లిప్పులు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. అలా సింగిల్‌ మూవీతో తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

నేటితరం అమ్మాయిల్లాగా మోడ్రన్, ట్రెండీ వేర్ ధరించకుండా ఎక్కువగా సాంప్రదాయ దుస్తుల వైపే మొగ్గు చూపడం మమితకు ప్లస్ పాయింట్ అయ్యింది. నిజానికి ప్రేమలు ఆమె తొలి చిత్రం కాదు.. అది మమితకు 16వ సినిమా. 2017లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె 18 చిత్రాల్లో నటించగా.. ప్రేమలతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యింది.

ఆపరేషన్ జావా, ఖో ఖో, సూపర్ శరణ్య, ప్రణయ విలాసం సినిమాలలో ఆమె నటించింది. ప్రేమలు బ్లాక్ ‌బస్టర్ నేపథ్యంలో మమితకు దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వరుసపెట్టి క్యూకడుతున్నాయి. ఇప్పటికే తమిళంలో జీవీ ప్రకాష్ కుమార్ సరసన రెబల్‌లో నటించగా.. తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన మమితకు హీరోయిన్‌గా ఛాన్స్ దక్కినట్లుగా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఓనమ్ పర్వదినం నేపథ్యంలో మమిత సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కేరళ సాంప్రదాయ దుస్తుల్లో పూజకి అవసరమైన ఏర్పాట్లు చేస్తూ సొగసులు చూపిస్తున్నారు మమిత. సిగలో మల్లెలు పెడుతూ చిరునవ్వులు చిందిస్తూ కుర్రాళ్ల మదిలో సెగలు రేపుతున్నారు. ప్రస్తుతం మమితా బైజు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: onam mamitha baiju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X