Remuneration: మమితా బైజుకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఆ రెండు క్రేజీ ఆఫర్స్‌తో!

ప్రేమలు సినిమాతో దక్షిణాది ప్రేక్షకులు, యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన యువ తార మమితా బైజూ. ప్రేమలు సినిమాలో ఆమె తన పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేయడంతో భారీగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అయితే తనకు నచ్చే, తన ఇమేజ్ పెంచే సినిమాలను ఎంచుకొంటూ కెరీర్‌ను చక్క దిద్దుకొంటున్నారు. అయితే మలయాళ ముద్దగుమ్మకు తెలుగు నుంచి ఎక్కువ ఆఫర్లు వస్తున్నట్టు వినికిడి. తాజాగా తెలుగులో నటిస్తున్న ఓ సినిమాకు భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

మమితా బైజు 2017 సంవత్సరంలోనే మలయాళ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకొంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు 20 సినిమాలు చేసినప్పటికీ ఆమెకు ఖోఖో మూవీ, సూపర్ శరణ్య తర్వాత ప్రేమలు చిత్రం బ్రహ్మండంగా పేరు, పాపులారిటీని తెచ్చిపెట్టింది. ప్రేమలు తర్వాత ఆమె కెరీర్ దక్షిణాదిలో ఊపందుకొన్నది. అగ్ర హీరోల సరసన ప్రస్తుతం నటిస్తున్నారు.

Mamitha Baiju Remuneration

ప్రేమలు తర్వాత బ్రహ్మండమైన ఆఫర్‌ను తమిళంలో ఆమె చేజిక్కించుకొన్నారు. తెలుగులో విజయవంతమైన భగవంత్ కేసరి సినిమాను తమిళంలో జన నాయకన్ అనే చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రంలో దళపతి విజయ్‌, పూజా హెగ్డేతో కలిసి మమితా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్‌గా క్రెడిట్ కొట్టేసింది.

అయితే ప్రేమలు సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఫుల్లుగా ఆదరణ కురిపించడంతో నేరుగా టాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై డ్రాగన్ సినిమా ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న డ్యూడ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ అనే దర్శకుడు సినిమా రంగానికి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అయితే ప్రదీప్ రంగనాథన్‌తో హీరోయిన్‌గా చేస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనేది ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. ఆమెకు సుమారుగా 50 లక్షల నుంచి 70 లక్షల పారితోషికం అందిస్తున్నారు అని పేర్కొన్నారు. అంతేకాకుండా జన నాయనక్ సినిమాకు కూడా భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం.

Mamitha Baiju Remuneration

ఇదిలా ఉండగా, ప్రదీప్, మమితా బైజు జంటగా నటిస్తున్న డ్యూడ్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల రిలీజైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్సాన్స్ వస్తున్నది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానున్న ఈ చిత్రం కథ, కథనాలు అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఈ సినిమా తర్వాత మమితా బైజుకు మరింత పాపులారిటీ పెరగడమే కాకుండా అత్యధిక రెమ్యునరేషన్ సాధించే హీరోయిన్లలో ఒకరిగా నిలుస్తుందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X