అల్లు అర్జున్ అంటే అలాంటి మోజు.. మమితా బైజుకు ఎందుకంత పిచ్చి అంటే?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు... మలయాళ ఇండస్ట్రీలోనూ ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంది. అక్కడి ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలూ బన్నీకి వీరాభిమానులనే విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు మలయాళ హీరోలు, హీరోయిన్లు ఇంటర్వ్యూల్లో అల్లు అర్జున్‌పై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ జాబితాలో యంగ్ హీరోయిన్, ప్రేమలు హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju) కూడా ఉన్నారు. ఈ అమ్మడు ఓ ఇంటర్య్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ పై తన అభిమానాన్ని గురించి చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
మలయాళ బ్లాక్‌బస్టర్ ప్రేమలు సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన మమిత, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు యూత్ హృదయాలను కూడా కొల్లగొట్టింది. ప్రేమలు సక్సెస్ తర్వాత సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతుంది. ఒకే ఒక్క హిట్‌తో భారీ పాపులారిటీ సంపాదించిన మమిత, ఇప్పుడు స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తోంది. ప్రేమలు తర్వాత ఆమె క్రేజ్ ఏ స్థాయికి చేరిందో చూస్తుంటే... త్వరలోనే టాలీవుడ్‌లోనూ ఈ మలయాళ కుట్టి సందడి చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో అల్లు అర్జున్‌పై ఆమె చేసిన అభిమాన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారాయి.

ఓ ఇంటర్వ్యూలో మలయాళ యంగ్ హీరోయిన్ మాట్లాడుతూ తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మమిత మాట్లాడుతూ.. 'అల్లు అర్జున్ కి డైహార్డ్ ఫ్యాన్‌ని, ఆయనను చాలా అభిమానిస్తుంటా. ఎంతలా అంటే... ఆయన ప్రతి సినిమాను పదిసార్లకు మించి చూశాను. ఇప్పటికీ ఎంజాయ్ చేయాలనిపిస్తే మళ్లీ అవే సినిమాలు పెట్టుకుని చూస్తుంటాను. ఒకానొక సమయంలో బన్నీపై నాకున్న పిచ్చి పీక్‌లో ఉండేది' అంటూ చెప్పింది.
అంతేకాదు, బన్నీ సినిమాల ప్రభావంతో తన లైఫ్‌స్టైల్ కూడా మారిపోయిందని మమిత ఆసక్తికరంగా వెల్లడించింది. ముఖ్యంగా జులాయి, ఇద్దరూ అమ్మాయిలతో సినిమాల్లో అల్లు అర్జున్ ధరించిన క్యాసియో వాచ్‌లు చూసాక తనకు కూడా వాటిపై మక్కువ పెరిగిందని చెప్పింది. వెంటనే అలాంటి వాచ్ కొనుక్కుని వేసుకునేదాన్నని తెలిపింది. ఇక స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకుంటూ... 'పాఠశాల రోజుల్లో బన్నీ డ్రెస్సింగ్ స్టైల్‌ని పూర్తిగా కాపీ చేసేదాన్ని. ఫుల్ స్లీవ్ టీషర్ట్ మీద షర్ట్ వేసుకుని, ఆ షర్ట్ స్లీవ్స్ మడిచే లుక్ నాకు చాలా ఇష్టం. కొన్నిసార్లు టామ్‌బాయ్‌లా కూడా స్కూల్‌కు వెళ్లేదాన్ని' అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది మమిత.
మరో ఇంటర్వ్యూలో ఆమె ఇంకా ఇలా చెప్పింది. 'నేను అల్లు అర్జున్‌కి పెద్ద ఫ్యాన్. హ్యపీ, బన్నీ లాంటి మూవీస్‌లో ఆయన స్టైల్ నాకు బాగా నచ్చేసింది. స్కిన్-ఫిట్ వెస్ట్‌లు, చెక్ షర్టులు, లేయర్డ్ లుక్స్... ఇవన్నీ ఫాలో అయ్యేదాన్ని. క్యాసియో వాచ్ కూడా రెగ్యులర్‌గా వాడేదాన్ని'
ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'మన మనసు గెలుచుకున్న మమితా.. బన్నీకి ఇంత పెద్ద అభిమానినా?' అంటూ సోషల్ మీడియాలో సరదా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో అల్లు అర్జున్ - మమిత బైజు కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే చూడాలని కూడా కోరుకుంటున్నారు.
ఇక మమిత కెరీర్ విషయానికి వస్తే.. ప్రేమలు సినిమా ఆమెకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ సినిమాకు గిరిష్ ఏడీ దర్శకత్వం వహించగా, హీరోగా నస్లేన్ కే గఫూర్ నటించాడు. పెద్దగా ప్రీ-రిలీజ్ హైప్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా విజయ్ దళపతి 'జన నాయగన్'లో మమితా బైజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎలాంటి కొత్త అడ్డంకులు ఎదురుకాకుండా సెన్సార్ క్లియరెన్స్ లభిస్తే, ఈ నెల 20న 'జన నాయగన్' థియేటర్లలోకి రావడం ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











