ప్రేమించుకుందాం రా! హీరోయిన్.. ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా షాకింగ్ లుక్!

సినిమా ప్రపంచంలో ఏడాదికి వందల సంఖ్యలో నటీనటులు పరిచయం అవుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా హీరోయిన్స్ కేటగిరీలో కూడా పోటీ గట్టిగానే ఉంది. హీరోయిన్ కావాలి అంటే కేవలం అందం ఉంటే సరిపోదు మంచి నటన కూడా ఉండాలి. అయితే అన్ని విధాలుగా ఒకప్పుడు బ్యూటిఫుల్ హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న వారిలో అంజలా ఝవేరి ఒకరు. ఆమె చేసిన సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ బ్యూటీ ఊహించని లుక్ లోకి మారిపోయింది.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే...

ఆ ఒక్క సినిమాతో మంచి క్రేజ్

ఆ ఒక్క సినిమాతో మంచి క్రేజ్

అంజలా జవేరి అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ ప్రేమించుకుందాం రా! సినిమా పేరు ఎత్తితే మాత్రం అందులో హీరోయిన్ చిరునవ్వు అప్పుడే గుర్తుకు వస్తుంది. ఎంతో సింపుల్ గా పక్కింటి అమ్మాయిల ఆ సినిమాలో కనిపించిన అంజలా ఝవరి ఆ తర్వాత ఊహించిన విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తొందరగానే బిజీ అయిపోయింది. ఆమెకు మొదట్లోనే బిగ్ హీరోలతో అవకాశాలు వచ్చాయి

టాలీవుడ్ లో వరుస హిట్స్

టాలీవుడ్ లో వరుస హిట్స్

ప్రేమించుకుందాం రా.. సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అంజలా, ఆ సినిమా విజయం కారణంగా వెంటనే మెగాస్టార్ చిరంజీవి చూడాలని ఉంది సినిమాలో కూడా అవకాశం అందుకుంది. అలాగే వెంకటేష్ తో మరోసారి ఆమె దేవి పుత్రుడు సినిమాలో కూడా నటించింది. ఇక ఈ బ్యూటీకి నాగార్జున రావోయి చందమామ సినిమాలో కూడా ఛాన్స్ దొరికింది. అలాగే ప్రేమ సందడి సినిమా కూడా అప్పట్లో మంచి సక్సెస్ ఇచ్చింది.

 బాలీవుడ్ విలన్ తో పెళ్లి

బాలీవుడ్ విలన్ తో పెళ్లి

గ్యాప్ లేకుండా అగ్ర హీరోలతో చాలా బిజీగా కొనసాగుతున్న అంజలా ఝవేరి కెరీర్ కొన్నాళ్ల వరకు బాగానే సాగింది. అయితే ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంది. కానీ అక్కడ అనుకున్నంత స్థాయిలో అయితే విజయాలు రాలేదు. ఇక అప్పుడే ఆమె బాలీవుడ్ తరుణ్ అరోరాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అప్పట్లో రీ ఎంట్రీ

అప్పట్లో రీ ఎంట్రీ

ఇక 2005 వరకు కాస్త బిజీగానే కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎక్కువగా సినిమాలు చేయలేదు. మళ్ళీ 2010లో ఒక తమిళ సినిమాతో సరికొత్తగా రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా అంతగా ఉపయోగపడలేదు. ఇక 2012లో మాత్రం శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక ఒక స్పెషల్ పాత్రతో మెప్పించే ప్రయత్నం చేసింది.

షాకింగ్ లుక్ లో అంజలా

షాకింగ్ లుక్ లో అంజలా

అయితే అంజలా ఝవేరి ఒకప్పుడు చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో కట్టుకునేది. కానీ ఇప్పుడు ఆమె మాత్రం గుర్తుపట్టలేని లుక్కులోకి మారిపోయింది. ఆమె వయస్సు 50 పైగానే ఉంటుంది. ఇక ఆమెకు సంబంధించిన ఫోటోలు చూస్తే ఒకప్పుడు వెంకటేష్ తో నటించిన హీరోయినేనా అని సందేహం వస్తుంది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మళ్లీ సినిమా ఇండస్ట్రీలో బిజీ అవ్వాలి అని అంజనా ప్రయత్నాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X