అక్కగా విద్యాబాలన్... సర్కారువారిపాటలో ప్రిన్స్ సోదరిగా...
బాలీవుడ్ లో బయోపిక్ లకు కావాల్సినంత క్రేజ్ తీసుకురావాలన్నా, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కు న్యాయం చేయాలన్నా విద్యాబాలన్ తలుపు తట్టాల్సిందే. ఈ పాలక్కడ్ చిన్నదాన్ని దక్షిణాదికి తీసుకురావాలని దర్శక-నిర్మాతలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ, చూడబోతే ఆ అదృష్టం టాలీవుడ్ ప్రిన్స్ కే రాసిపెట్టినట్లుంది.
నిజమే విద్యాబాలన్ ను టాలీవుడ్ కు తీసుకువచ్చే బాధ్యతను ప్రిన్స్ మహేశ్ బాబు భుజానికెత్తుకున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే, సర్కారు వారిపాటలో కీలకమైన ఓ పాత్రకు ఆమెను రంగంలోకి దించాలని దర్శక-నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారట. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సదరు పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేయగలదని భావిస్తున్నారు.

ఇక ఈ మేరకు ఇప్పటికే విద్యతో బేరసారాలు మొదలెట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ దక్షిణాది సినిమాలపై పెద్దగా దృష్ఠిపెట్టని విద్య, సూపర్ స్టార్ మూవీ అనేసరికి కాస్త ఎగ్జైట్ అయినట్లే కనిపిస్తోంది. పైగా ఈ సినిమాలో అమ్మడు మహేశ్ బాబు సోదరిగా కనిపించబోతుండటం మరో విశేషం.
గతంలో మణిరత్నం దర్శకత్వంలో ఉరిమి అనే సినిమాలో మినహా విద్య ధక్షిణాది చిత్రాల్లో కనిపించింది తక్కువనే చెప్పాలి. ఇక సర్కారు వారి పాటలో ప్రిన్స్ సోదరి పాత్రకు విద్యాబాలన్ నే దించేందుకు నడుంబింగించారంటే ఆ పాత్రకు ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమవుతోంది. మరి విద్య ప్రిన్స్ కు అక్కగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











