ఆ హీరో పదేపదే ముద్దుపెట్టుకున్నాడు.. కెమెరా ముందే నరకం చూపించాడు!

సినీ పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొనే ఇబ్బందులు, వేధింపుల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. మీటూ ఉద్యమం తర్వాత అనేక మంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ మరాఠీ నటి ప్రియా బాపట్ కూడా తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఒక బాధాకర ఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఓ పాట షూటింగ్ సమయంలో తన సహనటుడు స్క్రిప్ట్‌లో లేని సన్నివేశాలను ఇంప్రొవైజేషన్ పేరుతో చేయడమే కాకుండా పదేపదే బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడని ఆమె వెల్లడించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియా బాపట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మనసులో ఎన్నాళ్లుగానో దాచుకున్న సంఘటనను బయటపెట్టారు. ఒక సినిమా షూటింగ్ లో పాట చిత్రీకరణ సమయంలో స్క్రిప్ట్‌లో ఎక్కడా కిస్సింగ్ సీన్ లేదని, అయినప్పటికీ తన సహనటుడు సీన్‌ను మెరుగుపరుస్తున్నాననే పేరుతో హద్దులు దాటాడని ఆమె తెలిపారు. కెమెరా ఆన్‌లో ఉండటం, సెట్‌లో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉండటం, తాను కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం వంటి కారణాలతో వెంటనే స్పందించలేకపోయానని చెప్పారు.

Priya Bapat Recalls Disturbing On-Set Experience Reveals Co-Actor s Misconduct

"ఆ సమయంలో నాకు ఎలా స్పందించాలో తెలియలేదు. అతడిని అడ్డుకోవాలా, డైరెక్టర్‌కు చెప్పాలా, లేక షూటింగ్ ఆపాలా అనే అయోమయంలో ఉండిపోయాను. కెమెరా ముందే పదేపదే నన్ను ముద్దుపెడుతుంటే చాలా అవమానంగా అనిపించింది. కానీ నా భావోద్వేగాలను దాచుకుని నటించాల్సి వచ్చింది" అంటూ ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా ఇప్పటికీ బాధ కలుగుతుందని, కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు కూడా వస్తాయని ఆమె పేర్కొన్నారు.

ప్రియా బాపట్ ఇంకా మాట్లాడుతూ.. ఆ హీరో వేధింపు ఒక్క షూటింగ్ స్పాట్‌కే పరిమితం కాలేదు. సినిమా షూటింగ్ కోసం భోపాల్‌లో బస చేస్తున్న సమయంలో కూడా తనను అసౌకర్యానికి గురిచేశాడని ఆమె తెలిపారు. ఒకే హోటల్‌లో వేర్వేరు గదుల్లో ఉంటున్నప్పటికీ ప్రతిరోజూ తనను బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌కు రావాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. తాను పలుమార్లు నిరాకరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని వెల్లడించారు. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిన సందర్భాన్ని కూడా ప్రియా గుర్తు చేసుకున్నారు. ఒక రోజు రాత్రి తన గది వద్దకు వచ్చి తలుపు తట్టాడని, దీంతో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని చెప్పారు.

ఆ సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి, రేపు కలుద్దామని చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నానని వెల్లడించారు. వెంటనే తన భర్త ఉమేష్ కామత్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ చెప్పానని తెలిపారు. భార్య పరిస్థితిని అర్థం చేసుకున్న ఉమేష్ కామత్ వెంటనే ముంబై నుంచి భోపాల్‌కు చేరుకున్నారని ప్రియా చెప్పారు. మూడు రోజుల పాటు తనతోనే ఉండి ధైర్యం చెప్పారని, ఆ తర్వాతే ఆ సహనటుడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల మద్దతు లేకపోయి ఉంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవడం మరింత కష్టమయ్యేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే అమ్మాయిల పరిస్థితిపై కూడా ప్రియా బాపట్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా లేదా రాజకీయ నేపథ్యం లేకుండా ఎంతో మంది యువతులు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెడతారని, కానీ కొందరు వ్యక్తులు వారి అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని వేధింపులకు పాల్పడతారని చెప్పారు. కెరీర్‌పై ఎన్నో ఆశలు, కలలతో వచ్చిన అమ్మాయిలు ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతారని వ్యాఖ్యానించారు.

Read more about: bollywood film industry tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X