నా బాయ్‌ఫ్రెండ్‌కి చాలా మందితో ఎఫైర్లు... 10 ఏళ్లుగా అతనితోనే... స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

నటీనటులకు ఎఫైర్స్, రిలేషన్స్, పెళ్లిళ్లు, బ్రేకప్స్ కామన్. అయితే ఎవరూ కూడా తమ వ్యక్తిగత వివరాలను బయటకు చెప్పుకోవడానికి అంగీకరించారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక పుకార్లు వస్తూనే ఉంటాయి. వీటిని ఖండించేవారు కొందరైతే, చూసీ చూడనట్లుగా ఉండేవారు మరికొందరు. మరికొందరైతే తాము ఎవరితో రిలేషన్‌‌లో ఉన్నది ఎలాంటి దాపరికం లేకుండా చెబుతుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి వారు చాలా అరుదు. ఈ కోవలోకే వస్తారు కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్.

న్యూస్ రీడర్ నుంచి సెలబ్రిటీగా
ఓ న్యూస్ ఛానెల్‌లో సాధారణ న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియా భవానీ శంకర్.. నేడు సెలబ్రిటీ రేంజ్‌కు చేరుకున్నారు. తన కష్టం, క్రమశిక్షణతో ఇక్కడి వరకు చేరుకున్నారు. తొలుత సీరియల్స్‌లో అదృష్టం పరీక్షించుకున్న ప్రియకు ఆ తర్వాత సినీ రంగం నుంచి అవకాశాలు వచ్చాయ. మేయాద మాన్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియ వరుస హిట్స్‌తో కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీలు తెలుగులోకి డబ్ కావడంతో ఇక్కడి వారికి కూడా ప్రియ సుపరిచితులే. 2023లో యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన కళ్యాణం కమనీయం మూవీతో తెలుగులో తొలిసారి నటించారు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన భీమాలోనూ సందడి చేశారు, దూత వెబ్‌సిరీస్‌లో అక్కినేని నాగచైతన్యకు భార్యగా నటించారు.

Priya Bhavani Shankar Opens Up About Her Relationship Breakup Rumours and Career Journey

ప్రియా భవానీ శంకర్ వివాదాలు
తెలుగులో అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోవడంతో కోలీవుడ్‌కే పరిమితమయ్యారు ప్రియా భవానీ శంకర్. ఇండియన్ 2, రత్నం, డిమోంటే కాలనీ 2, బ్లాక్, హాట్ స్పాట్ 2 మచ్ తదితర చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం డిమోంటే కాలనీ 3, మరగధ నానయం 2, ఇండియన్ 3 సినిమాలలో ప్రియ నటిస్తున్నారు. విషయం ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం ప్రియా భవానీ శంకర్ స్టైల్. తన మనసులో ఏమున్నా కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడుతూ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు.

నా శరీరం వస్తువు కాదు
అప్పట్లో హీరోయిన్లు గ్లామర్ షో చేయడంపై ప్రియా శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపాయి. తన శరీరం ఒక వస్తువు కాదని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి గ్లామర్ షో చేయను. హీరోయిన్‌గా ఫ్యాషన్ అని చెప్పి కొన్ని అంశాలను ప్రమోట్ చేయలేనని స్పష్టం చేశారు. నటిగా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదన్నదే తన ఉద్దేశ్యమని ప్రియా భవానీ శంకర్ పేర్కొన్నారు.

నా బాయ్‌ఫ్రెండ్‌కు ఎఫైర్లు
ఇక నటిగా నేను ఏ హీరోతో నటిస్తే ఆ హీరోతో నాకు రిలేషన్ పెట్టేస్తున్నారు. హీరోలకు నేను బర్త్ డే ఇతరత్రా విషెస్ చేసినప్పుడల్లా సోషల్ మీడియాలో ఈ గాసిప్స్ మరింత ఎక్కువ అవుతున్నాయి. అలాంటి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే నా బాయ్‌‌ఫ్రెండ్ రాజ్‌ను, అతనితో నా బంధాన్ని బయటపెట్టానని ప్రియ తెలిపారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను రాజ్‌కి బ్రేకప్ చెప్పినట్లుగా వస్తున్న వార్తలకు తెరదించారు. రాజ్‌ వేల్ నా కాలేజీ మేట్.. అతనితో పదేళ్లుగా రిలేషన్‌లో ఉన్నా. నాకు మొదటి, చివరి బాయ్‌ఫ్రెండ్ అతనే. అయితే నేను అతనితో ప్రేమలో పడటానికి ముందే కాలేజీ రోజుల్లోనే రాజ్ చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. మీకు రిలేషన్‌లో ఉండటం ఇష్టం లేకపోయినా అది టాక్సిక్ బంధంలా అనిపించినా వెంటనే బ్రేకప్ చెప్పేసి బయటకు వచ్చేయాలని యువతకు ప్రియా భవానీ శంకర్ సూచించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X