ప్రతీరోజు ఆయనతో అలాంటి అనుభవమే.. క్రేజీ హీరో గురించి ప్రియమణి
దక్షిణాది చిత్ర పరిశ్రమలో గ్లామర్ హీరోయిన్‌గా ఆకట్టుకొన్న ప్రియమణి ప్రస్తుతం ఆచితూచి పాత్రలను ఎంచుకొంటున్నారు. బాలీవుడ్ సినిమాలతోపాటు టెలివిజన్ షోలతో బిజీగా ఉన్నారు. తెలుగు టెలివిజన్ రంగంలో పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా, న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటిగా మరో రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవల కాలంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న వెబ్ సిరీస్‌లో ప్రియమణి అడుగుపెట్టారు. వెబ్ సిరీస్ అనుభవాలను ఇటీవల పంచుకొంటూ..

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో
ప్రస్తుతం ప్రియమణి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఈ వెబ్ సిరీస్‌లో విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్‌తో కలిసి నటించారు. ఇంకా రాజీవ్ ఖండేల్‌వాల్, సంజయ్ సూరి లాంటి ప్రతిభవంతులైన నటులతో కలిసి కీలక పాత్రను పోషించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ మ్యాన్, మనోజ్ బాజ్‌పేయ్ గురించి తన అనుభవాలను పంచుకొన్నారు.

రెండో వెబ్ సిరీస్ ప్రాజెక్టులో
ప్రియమణి ఇప్పటి వరకు రెండు వెబ్‌సిరీస్‌లో నటించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కంటే ముందే అటీట్ అనే ప్రాజెక్టులో నటించారు అయితే టెక్నికల్‌గా ఫ్యామిలీ మ్యాన్ నాకు తొలి వెబ్ సిరీస్. సౌత్ నుంచి వెళ్లినప్పటికీ.. ఉత్తరాదిలో నన్ను బాగా చూసుకొన్నారు. ఇప్పటి వరకు ఎందరో నటులను చూశాను. కానీ మనోజ్, రాజీవ్, సంజయ్ లాంటి నటుల యాక్టింగ్ చాలా డిఫరెంట్ అని ప్రియమని చెప్పారు.

మనోజ్ బాజ్‌పేయ్ మ్యాజిక్ గురించి
మనోజ్ బాజ్‌పేయ్‌తో నటించడం గొప్ప అనుభూతి. స్క్రిప్టులో ఉన్న దానికంటే తెర మీదకు వచ్చే సరికి తన స్వరూపమే మారిపోతుంది. సీన్‌ను ఇంప్రూవ్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. సన్నివేశాల్లో మ్యాజిక్ సృష్టించడం ఆయనే సాధ్యం. ఒకవేళ కాస్త మనం అలర్ట్‌గా లేకపోతే ఆ మ్యాజిక్‌ను మిస్ అయిపోతుంటాం. మనోజ్ సార్‌తో వర్క్ చేస్తే.. మనం స్టూడెంట్ అయిపోతాం. ఆయనతో నటిస్తే ఓ విద్యార్థి, ఉపాధ్యయుడి అనుభవం ఉంటుంది. అలాంటి గొప్ప నటుడితో నటించడం సరికొత్త అనుభవం అని ప్రియమణి పేర్కొన్నారు.

తల్లిగా, భార్య పాత్రలో
ఇక తన రెండో వెబ్ సిరీస్ గురించి ప్రియమణి చెబుతూ.. నేను ప్రాజెక్ట్‌లో అనుమానస్పదంగా మరణించిన సైనికుడి భార్యగా నటించాను. ఈ సిరీస్‌లో నేను ఓ బిడ్డకు తల్లిగా కనిపిస్తాను. నటనకు, భావోద్వేగాన్ని పండించే అవకాశమున్న ఈ పాత్ర నాకు బాగా నచ్చింది. ఈ సిరీస్ జీ5లో ప్రసారమవుతున్నది.

నారప్ప చిత్రంలో వెంకటేష్‌తో
ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం అసురన్ రీమేక్‌లో నారప్ప చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ చిత్రం మైదాన్‌లో అజయ్ దేవగన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. గతంలో షారుక్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఓ పాటలో నర్తించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











