అలాంటి మగాడు దొరికితే.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
చిత్ర పరిశ్రమలో కొందరు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. వారి మాటలు, చేతలు అన్నీ కాంట్రవర్సీలుగా మారుతుంటాయి. ఈ కోవలోకే వస్తారు ప్రియ నాయుడు. వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ, కొత్త కుర్రాడు, శ్రీనివాస కళ్యాణం, మ్యాడ్ 2 తదితర సినిమాలలో నటించిన ప్రియా నాయుడు మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈ బ్యూటీకి అనుకున్న స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. మనసులో ఏమున్నాసరే కుండబద్ధలు కొట్టడం ఈ అమ్మాయి స్టైల్. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియా నాయుడు పెళ్లి, రిలేషన్ తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఆఫర్లు వస్తున్నప్పటికీ మీరెందుకు రిజెక్ట్ చేస్తున్నారని యాంకర్ ప్రశ్నించగా.. హీరోయిన్‌గా చేసేటప్పుడు హెడ్ వెయిట్ ఎక్కువైపోతుంది, అది నాకు ఇష్టం లేదు. కమిట్‌మెంట్ ఏ ఫీల్డ్‌లో లేదు.. పై ఆఫీసర్ ఏదో రకంగా లోబరచుకోవలనే చూస్తాడు. ఆడదాని బతుకంటేనే కమిట్‌మెంట్.. కాకపోతే ఇండస్ట్రీని మాత్రం బాగా ఎక్కువ చేసి చూపిస్తారు. తెరపై కనిపించే అమ్మాయిల్ని ఎంతో మంది అనుభవించాలని బయట కోరుకుంటారు. ఒకనైట్ గడపాలని కొందరు, వెంట వేసుకుని తిరగాలని మరికొందరు ఆశపడతారు. హోమ్లీ లైఫ్.. తాతలు ఆస్తులు, గట్టిగా సంపాదించి ఉండి మనం హైలెవల్ ప్రొఫెషన్‌లో ఉన్నామనుకో అప్పుడు వేరే సంగతి. ఒకడి కింద పనిచేసేటప్పుడు కమిట్‌మెంట్ తప్పదని ప్రియా నాయుడు తెలిపారు.

ఇండస్ట్రీలో నేను ఎవ్వరితోనూ కమిట్‌మెంట్ చేయలేదు, చేయను. ఎదుటివాడి ఉద్దేశం నాకు ఈజీగా అర్ధమైపోతుంది, 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. వీడు ఆఫర్ ఇచ్చేవాడా? ఇవ్వని వాడా అనేది అంచనా వేసేస్తా. ఆఫర్ ఇచ్చేవాడు కమిట్‌మెంట్ అడగడు. రవిబాబు గారితో సినిమా చేశాను.. ఆయన ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్. కొట్టి వర్క్ చేయిస్తాడు, పని ఇచ్చేవాడు అలా ఉంటాడు. పని ఇవ్వని వాడే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి నొక్కుతాడు అని ప్రియా నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను ఏనుగు తొండం ఘటికాచలం అనే సినిమాలో శ్రీకాంత్ అయ్యర్ గారికి గర్ల్ ఫ్రెండ్‌గా చేశాను. ఒక సీన్ సరిగా రాలేదు.. దాంతో రవిబాబుగారిని చూసి భయపడిపోతున్నాను. అప్పటికి 6 టేకులు తీసుకున్నాను, 7వ టేక్ నాటికి నాకు కాళ్లు చేతులు వణికిపోతున్నాయి. అందరిలో తిట్టేస్తారేమోనని భయం.. రవిబాబు గారు కెమెరామెన్‌గా చేస్తారు, డైరెక్షన్ చేస్తారు, ప్రొడక్షన్ చూసుకుంటారు, కాస్ట్యూమ్స్ చేసుకుంటారు, మొత్తం సెట్ అంతా ఆయనే మేనేజ్ చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి కూడా నాతో తప్పుగా ప్రవర్తించలేదు. ఇచ్చేవాడు ఎవడూ కూడా గోకడు.. కింద ఉండే వాళ్లు మాత్రమే ఇలాంటి బేకార్ పనులు చేస్తారు అని ప్రియా నాయుడు వెల్లడించారు.
తప్పు వైపు ఎక్కువ అవుతాం కానీ మంచి వైపు వెళ్లం. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎక్కువగా వెధవలతోనే కాంటాక్ట్‌లో ఉండేదానిని, ఇప్పుడు అలాంటి వాళ్లు లేరు. చాలా వరకు ఇలాంటివి తగ్గాయి కూడా. తొలిరోజుల్లో చాలా ఇబ్బందిపడ్డాను. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చామంటే ఖచ్చితంగా ఇబ్బందిపెట్టాలని చూస్తారు. ఇక అసలు మగాడు అంటే ఏంటీ అని యాంకర్ అడగ్గా.. మోసగాడు అని ప్రియా నాయుడు తేల్చేశారు. ఒక స్టాండడ్‌గా ఉండడు, ఒక్కరితో ఆగడు.. ఒక్క ఆడదానికే పరిమితం కాడు, అలాంటి వాడు ఉన్నాడంటే వాడి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటాను, లేదంటే కాళ్లు కడిగిన నీళ్లు స్నానం చేస్తా. ఒకటే మైండ్ సెట్ ఉండేవాడు, ఒకే ప్రేమను పంచేవాడు దొరికితే అతనితో రిలేషన్‌షిప్ కానీ, మ్యారేజ్‌కి కానీ రెడీ. అందరికీ బోల్డ్‌గా కనిపిస్తాను కానీ నేను చాలా ఎమోషనల్, ఒక్కసారి మన అనుకుంటే వాళ్ల చేయి వదిలిపెట్టను అని ప్రియా నాయుడు తెలిపారు. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications


