నాకు అదంటేనే ఇష్టం.. పేరెంట్స్ ఆపలేదు కానీ టీచర్లు వద్దంటున్నారు: ప్రియా వారియర్

కేవలం సెకన్ల కన్నుగీటు తోనే దేశ వ్యాప్తంగా క్రేజీ స్టార్ గా మారింది ప్రియా వారియర్. తమిళంలో ఒరు ఆధార్ లవ్, తెలుగులో లవర్స్ డే పేరుతో వచ్చిన సినిమాలోని ఓ పాటలో ప్రియా కన్నుగీటుకు యూత్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముద్దు ఇస్తూ గన్ పేల్చే సన్నివేశంలో ఆమె కన్నుకొట్టడం బాగా అట్రాక్ట్ చేసింది. దీంతో యు ట్యూబ్ సెన్సేషన్‌గా మారడమే గాక రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్‌గా మారింది మలయాళీ భామ ప్రియా వారియర్.

ఇటీవలే బాలీవుడ్ లోనూ అడుగుపెట్టిన ఈ పిల్ల.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు, గురువులకు తనపై ఎలాంటి అభిప్రాయముందో తెలిపింది ప్రియా. సినిమా ఛాన్సులు వచ్చాయి కదా అని చదువు మధ్యలోనే ఆపమని తన తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పలేదని అంటోంది ప్రియా. మరో ఏడాదిలో డిగ్రీ పట్టా పొందుతానని, అప్పుడు పూర్తిగా సినిమాల పైనే దృష్టి సారించే అవకాశం తనకు కలుగుతుందని ఆమె చెప్పింది. ఇక తనకు చదువు చెప్పిన టీచర్లు మాత్రం తాను నటన కంటే చదువులోనే చురుకని అంటుంటారని తెలిపింది ప్రియా.

Priya Prakash Shares some interesting issues in her career

నువ్వు వెంటనే నటన ఆపేసి చదువుపై దృష్టిసారించాలని టీచర్లు చెబుతుంటారని ఆమె పేర్కొంది. అయితే అది వారికి తనపై ఉన్న అభిమానం అని, అదే తాను పాటించే అవకాశం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ''నాకు నటన అంటేనే ఇష్టం. నేనేమీ ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్‌ని కాను. కాలేజ్‌కి వెళుతున్నందుకు గ్రేస్‌ మార్కులు కూడా పడవు'' అని సెన్సేషనల్ గా మాట్లాడింది ప్రియా. ఇక తాను గతంలో నటించిన లవర్స్ డే సినిమా కాంట్రవర్సీ పై స్పందిస్తూ.. ''ఆ సినిమాలో రోషన్‌, నూరిన్‌ షెరీఫ్‌తో పాటు నాకు కూడా సమాన నిడివి ఉన్న పాత్రను ఇవ్వాలనుకున్నారు మేకర్స్. కన్నుగీటే పాట హిట్టవడంతో నా పాత్ర నిడివిని కాస్త పెంచారు. అంతేకానీ నా వల్ల ఎవరి పాత్రల నిడివిని తగ్గించలేదు'' అని చెప్పింది.

Priya Prakash Shares some interesting issues in her career

ప్రియా వారియర్.. నితిన్ సరసన నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో నితిన్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ ప్రియాకే దక్కిందని అంటున్నారు. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X