లక్షలాది మందికి ఫ్యాన్స్‌కు షాక్.. లాక్‌డౌన్ సమయంలో ప్రియా వారియర్..
ఒకే ఒక కన్నుగీటుతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకొన్న ప్రియా ప్రకాశ్ వారియర్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. రెండేళ్ల క్రితం ఓరు ఆదార్ లవ్ చిత్రానికి సంబంధించిన టీజర్‌లో చిలిపిగా కన్నుగీటడంతో అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో లెక్కలేనంత మందిని ఫ్యాన్స్‌గా సంపాదించి పెట్టింది. అయితే తాజాగా సోషల్ మీడియా అకౌంట్ల విషయంలో తీసుకొన్న నిర్ణయం షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో యాప్‌లకు
ఓరు ఆధార్ లవ్ టీజర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోవడంతో ప్రియా వారియర్‌కు సోషల్ మీడియాలో భలే డిమాండ్ పెరిగిపోయింది. తమ సోషల్ మీడియా యాప్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటూ పలువురు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారు. ఇక ఇన్స్‌టాలో పోస్టు పెడితే కోట్లు గుమ్మరించారు. ఇలాంటి క్రేజ్‌తో ప్రియా వారియర్ భారీగా సంపాదించారు.

ఇన్స్‌టా నుంచి డీయాక్టివేట్
అయితే అందరి మాదిరిగానే ప్రియా వారియర్‌కు సోషల్ మీడియా పోస్టుల విషయంలో ట్రోల్స్ తప్పలేదు. వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకొంటూ వచ్చిన ప్రియా వారియర్ లాక్‌డౌన్ సమయంలో అనూహ్యంగా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ నుంచి తప్పుకొన్నారు. తన అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసినట్టు తెలిపారు.

ప్రియా వారియర్ తండ్రి స్పందన
ప్రియా వారియర్ ఇన్స్‌టాగ్రామ్ నుంచి తప్పుకోవడం గురించి ఆమె తండ్రి స్పందించారు. ప్రియా ఇన్స్‌టాగ్రామ్ నుంచి తప్పుకొన్న విషయం నిజమే. సినిమాలు, కెరీర్‌పై దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకొన్నారు. తనకు నచ్చినప్పుడు ఆమె తిరిగి ఇన్స్‌టాగ్రామ్‌లోకి వస్తుంది అని ఆయన తెలిపారు.
Recommended Video

షాకింగ్ డిసిషన్ వెనుక అసలు కారణం
ప్రియా వారియర్ నిర్ణయం వెనుక వేరే కారణముందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఆమె తన కెరీర్‌పై కాకుండా సోషల్ మీడియాపై దృష్టిపెడుతున్నారనే విమర్శలు ఎక్కువ వస్తుండటంతో ఆమె ఇన్స్‌టాగ్రామ్ నుంచి తప్పుకొన్నారు. ఇక నుంచి తాను యాక్టింగ్ కెరీర్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలని నిర్ణయించుకొన్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడపడం తప్పనే విషయాన్ని గుర్తించారు అని ప్రియా వారియర్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











