Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
అయ్యో పాపం.. నితిన్ మీద ఎక్కబోయి కింద పడిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్!
ప్రియా ప్రకాష్ వారియర్ అంటే తెలియని నెటిజన్లు ఉండరు. ఒక్క చిన్న క్లిప్పింగ్ తో దేశమంతా వైరల్ అయిన ఆమె అగ్ర తారలను కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. జస్ట్ అలా కన్ను కొట్టి కోట్లమంది కుర్రాళ్ళ మనసులను గెలుచుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో చెక్ సినిమా ద్వారా తన లక్కును. పరీక్షించుకుంటోంది. అయితే షూటింగ్ సమయంలో ఆమె కిందపడిపోయిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాన్సెప్ట్ తో అంచనాలను పెంచిన చెక్
ఉరిశిక్ష పడిన ఒక యువ ఖైదీ చెస్ ప్లేయర్ అయితే ఎలా ఉంటుంది అని కాన్సెప్ట్ తోనే అంచనాల డోస్ పెంచిన మూవీ చెక్. జైలులో ఉన్న ఆ యువకుడు తనకు ఎదురైన పరిస్థితులతో ఏ విధంగా పోరాడాడు అనే.. కాన్సెప్ట్ లైన్ ఎంతో ఆసక్తిగా ఉంది. ఈ ఒక్క లైన్ చెక్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
చెక్ పై ఆశలు పెట్టుకున్న ప్రియా ప్రకాష్
భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. చదరంగం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తెలుగులో బిజీ అవ్వాలని అనుకుంటోంది.
నితిన్ వెనకాల నుంచి ఎక్కబోయి..
ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ ఒక సాంగ్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. నిన్ను చూడకుండా అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పాట చిత్రీకరణ సమయంలో ప్రియా ప్రకాష్ అనుకోకుండా కింద పడిందట. అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. నితిన్ వెనకాల నుంచి ఎక్కబోయి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. కింద పడిపోయిన ప్రతి సారి పైకి లేస్తూనే ఉన్నాను.. అనేలా ఒక మంచి కామెంట్ కూడా జత చేసింది.
అల్లు అర్జున్ సినిమాలో కూడా..
ఇక ప్రియా ప్రకాష్ వారియర్ పలు సినిమాలతో బిజీ అవుతోంది. చెక్ అనంతరం మరిన్ని అవకాశాలు వస్తాయని ప్రియా నమ్మకంతో ఉంది. ఇక గత కొంతకాలంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రియా ప్రకాష్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా నటించే ఛాన్స్ ఉందట. బన్నీ, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో ఈ బ్యూటీని ఒక ముఖ్యమైన పాత్రకు సెలెక్ట్ చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది.