Priya Prakash Varrier: సాగర తీరంలో పొట్టి దుస్తుల్లో ప్రియా ప్రకాష్ ఘాటు పోజులు.. అందంతో ఎర
ఓవర్ నైట్ స్టార్ అదేనండీ రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అనే మాటకు పక్కా నిదర్శనం ప్రియా ప్రకాష్ వారియర్. ఒక పాటలో.. ఒక్క కన్నుగీటుతో స్టార్ అయిపోయింది. మొదటి సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఆ సినిమా కోసం కన్ను కొట్టిన ప్రియా ప్రకాష్ వారియర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ కన్ను గీటుపై సెలబ్రిటీ నుంచి రాజకీయవేత్తల వరకు రియాక్ట్ అయినట్లు వచ్చిన మీమ్స్ మాములు ట్రెండ్ కాలేదు. దీంతో ఒక్కసారిగా స్టార్ అయింది ఈ వింక్ బ్యూటి. పలు సినిమాలతో బిజీగా ఉన్న ప్రియా ప్రకాష్ సోషల్ మీడియాలో హాట్ గా రెచ్చిపోతుంది. ఎద అందాలు, తడిసిన బట్టల్లో గ్లామర్ కే కొత్త అర్థం తీసుకొస్తున్న ప్రియా ప్రకాష్ బీచ్ లో దిగిన లేటెస్ట్ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.

ఎనలేని పాపులారిటీని..
సినీ పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంటారు. అలాంటి వారిలో మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుంది.

స్కూల్ ఏజ్‌లో లవ్ స్టోరీ..
అలాగే, ఫ్లైయింగ్ కిస్ గన్‌తో ఫిల్మ్ మేకర్లు తన వైపు చూసేలా చేసుకుంది. దీంతో అన్ని భాషల్లో ఆమెకు ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. స్కూల్ ఏజ్‌లో లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'. ఈ సినిమా ద్వారానే ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా పరిచయమై ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

వివిధ భాషల్లో రిలీజ్..
ఈ సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేసింది. అందుకు అనుగుణంగానే తెలుగు సహా కొన్ని భాషల్లోకి డబ్బింగ్ అయింది. 'ఒరు అదార్ లవ్' టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం.. గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయింది.

సెన్సేషనల్ స్టార్..
దీంతో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కి సెన్సేషనల్ స్టార్ అయింది. దీని తర్వాత నెటిజన్లు ఆమెను వెతకడం.. ఆమె గురించి తెలుసుకోవడం వంటివి చేయడంతో సోషల్ మీడియాలో ప్రియా పేరు మారుమ్రోగిపోయింది. 'ఒరు అదార్ లవ్' చిత్రం ద్వారా దక్కిన క్రేజ్‌తో ప్రియా ప్రకాశ్ వారియర్.. ఎన్నో ఆఫర్లను అందుకుంది.

తెలుగులో 'చెక్' సినిమాతో..
మరీ ముఖ్యంగా ఈ చిన్నది 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. అయితే, దీనికి చిక్కులు ఎదురు కావడంతో ఈ మూవీ విడుదల కాలేదు. ఇక, తెలుగులో 'చెక్' అనే సినిమాతో పరిచయమైన ఈమె.. 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' అనే మూవీలోనూ చేసింది. ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది.

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా..
ఇప్పుడీ చిన్నది కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీ చేస్తోంది. అలాగే, హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'కొల్ల', '4 ఇయర్స్' వంటి వాటిలో భాగమైంది. అలాగే, ప్రియా తెలుగులోనూ పలు ప్రాజెక్టులను చేయబోతుంది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది.

హాట్ హాట్ ఫొటోలు..
ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తూనే ఉంటోంది. అందులో ఎక్కువగా ఎద అందాలు ఆరబోసినవే ఉంటున్నాయి. దీంతో ఈ చిన్నది దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది. ఈ యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.

పొట్టి దుస్తుల్లో బీచ్ లో..
ఆరెంజ్ టాప్, బ్లాక్ షార్ట్ జీన్స్ ధరించిన ప్రియా బీచ్ లో హాట్ గా పోజులిచ్చింది. పొట్టి దుస్తుల్లో బీచ్ లో అలల పక్కన తన స్మైల్ తో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది ప్రియా ప్రకాష్ వారియర్. అలాగే వైట్ డ్రెస్ లో అలల మధ్య కూర్చుని కొంటెగా చూస్తూ పోజులిచ్చింది ఈ బ్యూటి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











