Priya Prakash Varrier: బికినీలో హద్దులు దాటేసిన వింక్ బ్యూటీ.. ఇంతకంటే హీటెక్కించే లుక్ ఉంటుందా?
కొంతమంది హీరోయిన్స్ బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు చూడకపోయినా కూడా వారి అందంతో మంచి క్రేజ్ అందుకుంటూ ఉంటారు. ఇక ఆ రూట్లో ఇంటర్నెట్ ప్రపంచంలో మంచి గుర్తింపు అందుకున్న వారిలో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. అమ్మడు కేవలం ఒకే ఒక్క విడియోతో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాకు సంబంధించిన చిన్న క్లిప్ ద్వారా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఇప్పుడు తన గ్లామర్ తో మరీంత ఆకట్టుకుంటోంది. ఇక రీసెంట్ గా బికినీ అందాలతో కూడా స్టన్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఒక్క రాత్రికే ఊహించని క్రేజ్:ఒరు ఆదార్ లవ్ మూవీలో సాంగ్ తో సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయిన అందాల భామ ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ అమ్మడు కన్నుకొట్టి కుర్రాళ్ళు అందరిని తన బుట్టలో వేసుకుంది. దీంతో ఇన్స్టాగ్రామ్ లో నైట్ లోనే ఫాలోవర్స్ పెరిగిపోయారు. దీంతో ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయిన ఫాలోవర్స్ మాత్రం లక్షల్లో ఉన్నారు.

గ్లామర్ షోతో మరింత క్రేజ్:సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకి సంబందించిన అప్డేట్స్ ని ఈ బ్యూటీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. నార్త్ ఇండియన్ భామలకి ఏ మాత్రం తీసిపోని రీతిలో గ్లామర్ షో చేయడానికి ప్రియా ప్రకాశ్ రెడీగా ఉంటుంది. తెలుగులో ఈ అమ్మడు నితిన్ చెక్, తేజ సజ్జాకి జోడీగా ఇష్క్ సినిమాలలో నటించింది. ఈ రెండు డిజాస్టర్ అయ్యాయి.

అన్ని భాషల్లో బిజీబిజీగా:గత ఏడాది మాతృభాషలో 4 ఇయర్స్ అనే లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో 3 మంకీస్, యారియాన్ 2, లవ్ హ్యాకర్స్ సినిమాలో లీడ్ రోల్ లో పూర్తి చేసింది. రిలీజ్ కి సిద్ధంగా అవుతున్నాయి. అలాగే కన్నడలో విష్ణు ప్రియ అనే మూవీలో నటించింది. మాతృభాషలో కోలా అనే చిత్రం కంప్లీట్ చేసింది.

తెలుగులో బిగ్ ఆఫర్:ఈ చిత్రాలు అన్ని రిలీజ్ కి సిద్ధమై ఉన్నాయి. తెలుగులో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబోలో వస్తున్నా వినోదాయ సీతమ్ రీమేక్ లో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతుంది. ఇది కూడా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇలా ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాలు వింక్ బ్యూటీ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటితో తన ఫేట్ మారిపోతుందని అమ్మడు ఆశపడుతోంది.
బికినీలో స్టన్ అయ్యేలా..:ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. తాజాగా మాల్దీవులు ట్రిప్ కి వెళ్తున్న వీడియో షేర్ చేసింది. అందులో బీచ్ అందాలని ప్రియ ఆశ్వాదిస్తూ ఉంటే ఆమె బికినీ అందాలు కుర్రాళ్ళు చూస్తూ ఆనందిస్తున్నారు. తీరంలో హాట్ వెబ్ సోకులతో తెరైపారా చూపిస్తూ కుర్రాళ్ళకి ఈ అమ్మడు మతిపోగోడుతోంది.


Click it and Unblock the Notifications











