Don't Miss!
- News
Bengaluru: ఇది బెంగళూరులో పరిస్థితి, జంటను కారులో వెంబడించి. కారు కెమెరాలో చిక్కిపోయారు!
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
హద్దు దాటిన ప్రియా ప్రకాష్ హాట్ షో: షర్ట్ విప్పేసి మరి చూపిస్తూ!
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగాక ఎంతోమంది టాలెంటెడ్ నటీనటులు స్టార్ గా మారారు. అందులో కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్ అయి రికార్డ్ క్రియేట్ చేశారు. అలా రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ప్రియా ప్రకాష్ వారియర్. ఒకే ఒక్క కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. చేసిన మొదటి సినిమా పెద్దగా ఆడకున్న ప్రియా ప్రకాష్ వారియర్ కు వచ్చిన ఫేమ్ అంతా ఇంతా కాదు. ఇక ఆ చిత్రంలో కన్ను కొట్టి చేసిన రచ్చ మాములుగా ట్రెండ్ కాలేదు. దీంతో సినీ అవకాశాలను దక్కించుకున్న అంతగా క్లిక్ కాలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటోంది ఈ చిన్నది.

తొలి చిత్రంతోనే..
సినీ పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్లుగా మారతారు. అది కూడా అనేక చిత్రాలు చేసి, అవి హిట్ అయితేనే వారికి ఆ స్టార్ డమ్ వస్తుంది. కానీ తొలి చిత్రంతోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుని సరికొత్తగా రికార్డ్ క్రియేట్ చేసింది.

లవ్ కాన్సెప్ట్ తో..
కన్ను కొట్టి, ఫ్లైయింగ్ కిస్ గన్ పేల్చి దర్శకనిర్మాతలను తనవైపు ఆకర్షించుకుంది బ్యూటిఫుల్ భామ ప్రియా ప్రకాష్ వారియర్. అలా ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియాకు దాదాపుగా అన్ని భాషల్లో ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. స్కూల్ ఏజ్‌లో లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'. ఈ సినిమా ద్వారానే ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా పరిచయమై ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

ప్రియా కోసమే సినిమా..
'ఒరు అదార్ లవ్' సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ చిత్రాన్ని వివిధ భాషల్లోనూ విడుదల చేసింది. అందుకు అనుగుణంగానే తెలుగు సహా కొన్ని భాషల్లోకి డబ్బింగ్ అయింది. అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. 'ఒరు అదార్ లవ్' టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం.. గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ఆకర్షించిన ప్రియా ప్రకాష్ వారియర్ కోసం సినిమా చూసిన వారందరూ నిరుత్సాపడ్డారు.

రాజకీయవేత్తల నుంచి..
సినిమా ఫలితం ఎలా ఉన్న అలా కన్ను కొట్టి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కి సెన్సేషనల్ స్టార్ అయింది. దీని తర్వాత నెటిజన్లు ఆమెను వెతకడం.. ఆమె గురించి తెలుసుకోవడం వంటివి చేయడంతో సోషల్ మీడియాలో ప్రియా పేరు మారుమ్రోగిపోయింది. అలాగే ఆమె కన్నుగీటుతో రాజకీయ వేత్తల నుంచి స్టార్ హీరోల వరకు వచ్చిన మీమ్స్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి.

చెక్ మూవీతో తెలుగులో
'ఒరు అదార్ లవ్' చిత్రం ద్వారా దక్కిన క్రేజ్‌తో ప్రియా ప్రకాష్ వారియర్.. ఎన్నో ఆఫర్లను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ చిన్నది 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. అయితే, దీనికి చిక్కులు ఎదురు కావడంతో ఈ సినిమా విడుదల కాలేదు. ఇక, తెలుగులో 'చెక్' అనే సినిమాతో పరిచయమైన ఈమె.. 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' అనే మూవీలోనూ చేసింది. ఆ సినిమాలు ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి.

దక్షిణాది భాషలతోపాటు హిందీలో..
ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఇప్పుడీ చిన్నది కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీ చేస్తోంది. అలాగే, హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'కొల్ల', '4 ఇయర్స్' వంటి వాటిలో భాగమైంది. అలాగే, ప్రియా తెలుగులోనూ పలు ప్రాజెక్టులను చేయబోతుంది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

తాజాగా హాట్ ఫొటోలతో..
సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటూనే ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తూనే ఉంటోంది. అందులో ఎక్కువగా ఎద అందాలు ఆరబోసినవే ఉంటున్నాయి. దీంతో ఈ చిన్నది దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది. ఈ యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మరి కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.

షర్ట్ విప్పి అందాల ఆరబోత..
బ్లాక్ చెక్స్ షర్ట్, బ్లాక్ కలర్ బ్రా వేసుకుని హాట్ గా పోజులిచ్చింది యంగ్ బ్యూటి ప్రియా ప్రకాష్ వారియర్. కింద కూర్చుని కెమెరాకు పోజులిచ్చిన ప్రియా.. తన షర్ట్ విప్పేసి మరి ఎద అందాలను ప్రదర్శించింది. ఎద భాగాలతోపాటు వాటిపై ఉన్న ప్రియా ప్రకాష్ వారియర్ టాటూ చూపరులను అట్రాక్ట్ చేస్తోంది. బ్లాక్ కలర్ సన్ గ్లాసెస్ పెట్టుకున్న ప్రియా ప్రకాష్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.