అవి చూపిస్తూ ప్రియా ప్రకాష్ అందాల విందు.. స్వర్గం అంటూ బ్రాలో ఎక్స్‌పోజింగ్
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగాక ఎంతోమంది టాలెంటెడ్ నటీనటులు సెలబ్రిటీలుగా మారారు. అందులో కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్ అయి రికార్డ్ క్రియేట్ చేశారు. అలా రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బ్యూటి ప్రియా ప్రకాష్ వారియర్.
ఒకే ఒక్క కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ చిన్నది సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఏదైతే తనకు విపరీతమైన ఫేమ్ తీసుకొచ్చిందో అందులోనే స్టన్ అయ్యే గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ హైలెట్ అవుతోంది. తాజాగా అలాంటి కొన్ని ఫొటోలు పంచుకుంది ఈ సుందరి.

రొమాంటిక్ కాన్సెప్ట్: కన్ను కొట్టి, ఫ్లైయింగ్ కిస్ గన్ పేల్చి ఆల్ సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులను తనవైపు ఆకర్షించుకుంది మలయాళి ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. అలా ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియా వారియర్ కు దాదాపుగా అన్ని భాషల్లో ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. స్కూల్ ఏజ్ లవ్ అండ్ రొమాంటిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'.

తెలుగు సహా: తెలుగులో కూడా విడుదలైన 'ఒరు అదార్ లవ్' సినిమా ద్వారానే ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ చిత్రాన్ని వివిధ భాషల్లోనూ విడుదల చేసింది. అందుకు అనుగుణంగానే తెలుగు సహా కొన్ని భాషల్లోకి డబ్బింగ్ అయింది. అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు.

సెన్సేషనల్ స్టార్: 'ఒరు అదార్ లవ్' టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం, గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ఆకర్షించిన ప్రియా ప్రకాష్ వారియర్ కోసం సినిమా చూసిన వారందరూ నిరుత్సాపడ్డారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఆమె కన్ను కొట్టి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో ప్రియా ప్రకాష్ వారియర్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. దీంతో సెన్సేషనల్ స్టార్ అయింది.

విడుదల కానీ చిత్రం: 'ఒరు అదార్ లవ్' చిత్రం ద్వారా దక్కిన క్రేజ్‌తో ప్రియా ప్రకాష్ వారియర్ ఎన్నో సినీ ఆఫర్లను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ చిన్నది 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. కానీ ఇది విడుదల కాలేదు. ఇక, తెలుగులో నితిన్ తో 'చెక్' అనే సినిమాతో నేరుగా తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. అది అంతగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' అనే సినిమాలోనూ చేసింది.
సినిమాలతో ఫుల్ బిజీ: ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ కన్నడంలో 'విష్ణుప్రియ', లైవ్ అనే సినిమాలు చేస్తోంది. అలాగే, హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'కొల్ల', '4 ఇయర్స్' వంటి వాటిలో భాగమైంది. అలాగే, ప్రియా తెలుగులోనూ పలు ప్రాజెక్టులను చేయబోతుంది.

భూమి మీద స్వర్గం: దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న బ్యూటి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో తాజాగా హాట్ పిక్స్ వదిలింది. పొట్టి దుస్తుల్లో సముద్రం వ్యూ స్పాట్ లో కూర్చోని వెనక్కి తిరిగి హాట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఇందులో ఆమె నడుము, థైస్ అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. భూమి మీద స్వర్గం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. బికినీ పిక్స్ ఫొటోలు షేర్ చేయాల్సిందిగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











