twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియా వారియర్ మరో రికార్డు.. 2 వేల థియేటర్లలో.. ఆ హీరో ఆఫర్ అందుకే రిజెక్ట్ చేశా!

    |

    వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్‌ తన మొదటి సినిమా లవర్స్ డే (మలయాళంలో ఒరు ఆడార్ లవ్) చిత్రం రికార్డుస్థాయిలో రిలీజ్ కానున్నది. ఈ చిత్ర టీజర్‌లో ప్రియా వారియర్ కన్నుగీటి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న రిలీజ్‌కు సిద్ధమైంది. ఒరు ఆడార్ లవ్ చిత్రం రిలీజ్ నేపథ్యంలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియా వారియర్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

    ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలో

    ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలో

    తాను నటించిన తొలి చిత్రంతోనే ప్రియా వారియర్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఒరు ఆడార్ లవ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలో విడుదల అవుతున్నది. ఓ హీరోయిన్, ప్రధానంగా అంతా కొత్తవారే నటించిన తొలి చిత్రమే ఇంత భారీగా రిలీజ్ కావడం ఇదే తొలిసారి. ఈ చిత్రం తెలుగులో లవర్స్ డేగా రిలీజ్ అవుతున్న విషయం విదితమే.

    అల్లు అర్జున్ అంటే ఇష్టం

    అల్లు అర్జున్ అంటే ఇష్టం

    ఒరు ఆడార్ లవ్ చిత్ర టీజర్ వైరల్‌గా మారిన సమయంలో నాకు అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం వచ్చింది. అల్లు అర్జున్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా ఆరంభంలో చేసుకొన్న అగ్రిమెంట్ ప్రకారం ఆ సినిమాను రిజెక్ట్ చేశాను. ఆ సమయంలో నేను కొంత నిరాశకు గురయ్యాను అని ప్రియా వారియర్ చెప్పింది.

    <strong>ఆ పరిస్థితుల్లో హౌజ్ అరెస్ట్ చేశారు.. అల్లు అర్జున్‌తో ఆఫర్.. ప్రియా వారియర్</strong>ఆ పరిస్థితుల్లో హౌజ్ అరెస్ట్ చేశారు.. అల్లు అర్జున్‌తో ఆఫర్.. ప్రియా వారియర్

    లవర్స్ డే ఆడియోలో అల్లు అర్జున్‌తో

    లవర్స్ డే ఆడియోలో అల్లు అర్జున్‌తో

    అల్లు అర్జున్ సినిమాను రిజెక్ట్ చేసినప్పటికీ.. స్టైలిష్ స్టార్‌ను కలిసే అవకాశాన్ని ప్రియావారియర్ త్వరగానే దక్కించుకొన్నది. ఇటీవల జరిగిన లవర్స్ డే ఆడియో ఫంక్షన్‌కు అల్లు అర్జున్ హాజరుకాగా.. తుపాకీ గురిపెట్టి కాల్చిన సీన్‌ను మీడియా బంధించింది. ఆ ఫొటో కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.

     శ్రీదేవి బంగ్లా వివాదంపై స్పందన

    శ్రీదేవి బంగ్లా వివాదంపై స్పందన

    తన రెండో చిత్రం శ్రీదేవి బంగ్లా వివాదంపై ప్రియా వారియర్ స్పందించారు. నాకు వివాదాల్లో చిక్కుకుపోవడం ఇష్టం లేదు. అలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకొంటాను. అయితే శ్రీదేవి బంగ్లా వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలకే నోటీసులు అందాయి. అంతకంటే నాకు ఎలాంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు.

    ట్రోలింగ్‌ను నేను పట్టించుకోను

    ట్రోలింగ్‌ను నేను పట్టించుకోను

    లవర్స్ డే చిత్రంలో లిప్ లాక్, ఇతర వివాదాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ దాడిపై మాట్లాడుతూ.. సెలబ్రిటీ అంటే ఇలాంటివి సాధారణమే. అలాంటి వాటిని చూసి చూడకుండా ఉంటే చాలా మంచింది. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని సమాధానం ఇచ్చారు.

    English summary
    Priya Prakash Varrier, popularly known as 'winking girl', is currently awaiting the release of Oru Adaar Love, which will grace more than 2,000 theatres across the country on February 14. She revealed the reason behind rejecting the offer to act in an Allu Arjun movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X