ఆ విషయంలో పవన్ కల్యాణ్‌కు ఫుల్ సపోర్ట్.. ఛాన్స్ దొరికితే ఆ పని చేస్తా.. ప్రియా ప్రకాశ్ వారియర్ ఇంటర్వ్యూ

మలయాళ చిత్రంలో ఓ పాటలో కన్ను గీటిన అందాల భామ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్‌నైట్‌లో వరల్డ్ వైడ్ పాపులారిటీని సంపాదించుకొన్నారు. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా హిట్లు చేజిక్కించుకోలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న బ్రో సినిమాలో కీలక పాత్రలో ప్రియా ప్రకాశ్ కనిపించనున్నారు. ఈ సినరిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

పవన్ కల్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారనే విషయం తెలుసు. కానీ నేను పాలిటిక్స్ ఫాలో కాను. ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానం గురించి నాకు తెలుసు. ప్రజలపై ఆయన విజన్ చాలా పవర్‌ఫుల్ అని తెలుసు. కానీ రాజకీయాల్లో ఆయన చేస్తున్నారనే విషయం లోతుల్లోకి వెళ్లి తెలుసుకొనే అవకాశం కలుగలేదు అని ప్రియా ప్రకాశ్ వారియర్ అన్నారు.

పవన్ కల్యాణ్‌తో సెట్లో పెద్దగా మాట్లాడుకోలేదు. ఆయనకు నాకు ఎక్కువగా కాంబినేషన్ సీన్లు లేవు. అందుకే ఆయనతో చాలా తక్కువగా మాట్లాడాను. అవకాశం దొరికితే ఎక్కువ సమయం గడపాలని చూశాను. కానీ ఆ ఛాన్స్ దొరకలేదు. భవిష్యత్‌లో ఆయనతో సినిమా చేస్తే నేను చాలా విషయాలు మాట్లాడాలని ఉంది అని ప్రియా ప్రకాశ్ వారియర్ చెప్పారు.

పవన్ కల్యాణ్ గురించి మాత్రమే తెలుసు. ఆయన పార్టీ జనసేన సిద్దాంతాలు తెలియవు. కాబట్టి నా సపోర్ట్ ఎప్పుడూ పవన్ కల్యాణ్‌కు ఉంటుంది. ఆయన పార్టీ గురించి, పాలిటిక్స్ గురించి తెలియదు కాబట్టి నేను పూర్తిగా స్పందించడం లేదు. ఆయన నేను పెద్ద ఫ్యాన్‌ను. కాబట్టి ఆయనకు నా సపోర్ట్ ఉంటుంది అని ప్రియా ప్రకాశ్ వారియర్ చెప్పారు.

Priya Prakash Varrier Pawan Kalyan

బ్రో సినిమాలో నాకు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌, కేతిక శర్మతో కాంబినేషన్ సీన్లు ఉంటాయి. అయితే నా పాత్ర ఏమిటనే విషయాన్ని నేను లీక్ చేయను. స్క్రీన్ మీద చూస్తే మీరు థ్రిల్ అవుతారు. బ్రో సినిమా తప్పకుండా మంచి ఫీల్ కలిగిస్తుంది. థియేటర్లలో ప్రేక్షకుల మధ్య సినిమా చూడాలని అనుకొంటున్నాను అని ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X