twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియా వారియర్ క్రేజా మజాకా? లవర్స్ డే‌కు భారీ బిజినెస్.. అల్లు అర్జున్‌తో సహకారంతో..

    |

    Recommended Video

    Priya Prakash Warrior's Lovers Day Is Set To Release On February 14th

    వింక్ గర్ల్‌ ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ నటించిన లవర్స్ డే చిత్రం ప్రేమికులు దినోత్సవం ఫిబ్రవరి 14న లవర్స్ డే‌గా రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో విడుదల కానున్నది. క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    జనవరి 23 తేదీన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లో జరిగిన లవర్స్ డే ఆడియో ఫంక్షన్ తర్వాత లవర్స్ డే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మా ఆహ్వానాన్ని మన్నించి ఆడియోకు వచ్చిన అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. ఆయన రాకతో మా సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడింది. చిన్న చిత్రానికి అందించిన సహకారాన్ని మాటల్లో చెప్పలేం అని నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి తెలిపారు.

    ఆడియో రిలీజ్ తర్వాత

    ఆడియో రిలీజ్ తర్వాత

    లవర్స్ డే ఆడియో రిలీజ్ తర్వాత ప్రియా ప్రకాశ్ వారియర్ టాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను తెలుగుదనానికి దగ్గరగా చేసేందుకు, ప్రేక్షకులకు సంపూర్ణమైన వినోదాన్ని అందించేందుకు ప్రీ ప్రోడక్షన్ పనులను క్వాలిటీతో రూపొందించాం అని వెల్లడించారు.

    డబ్బింగ్‌ చెప్పిన క్రేజీ సింగర్

    డబ్బింగ్‌ చెప్పిన క్రేజీ సింగర్

    ప్రియ వారియర్‌కు తెలుగులో ఉమ (ప్రముఖ దర్శకుడు రేలంగి నర్సింహారావు తమ్ముడు కూతురు), ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రను పోషించిన నూరిన్‌కు సింగర్ లిప్సిక డబ్బింగ్ చెప్పారు. లవర్స్ డే చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి. గీత రచయితలు చైతన్య ప్రసాద్, శివ గణేష్, శ్రీజో, శ్రీ సాయికిరణ్ సాహిత్యాన్ని అందించారు. ఇందులో ఓ పాట థియేటర్లలో ప్రేక్షకులను సర్ఫ్రైజ్‌గా ఉంటుంది అని నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి పేర్కొన్నారు.

    అంచనాలకు మించి బిజినెస్

    అంచనాలకు మించి బిజినెస్

    ప్రియా వారియర్ క్రేజ్, పాటలకు విపరీతమైన స్పందన రావడంతో పెరిగిన అంచనాలకు తగినట్టుగా అన్ని ఏరియాల్లో బ్రహ్మండమైన బిజినెస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదలకు అన్ని హంగులు పూర్తి చేసుకొన్నాం. ప్రేమికుల దినోత్సవం కానుకగా లవర్స్ డే ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అని నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి తెలిపారు.

    <strong>ఆ పరిస్థితుల్లో హౌజ్ అరెస్ట్ చేశారు.. అల్లు అర్జున్‌తో ఆఫర్.. ప్రియా వారియర్</strong>ఆ పరిస్థితుల్లో హౌజ్ అరెస్ట్ చేశారు.. అల్లు అర్జున్‌తో ఆఫర్.. ప్రియా వారియర్

     నటీనటులు, సాంకేతికవర్గం

    నటీనటులు, సాంకేతికవర్గం

    న‌టీన‌టులు: నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు

    సాంకేతిక నిపుణులు : కెమెరా: శీను సిద్ధార్థ్‌

    ఎడిటింగ్‌: అచ్చు విజ‌య‌న్‌

    సంగీతం: షాన్ రెహ‌మాన్‌

    స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా

    క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు

    నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి

    English summary
    Sensation girl Priya Prakash Warrior's Lovers day is set to release on February 14th. This movie's Audio release function on January 23rd. Stylish Star Allu Arjun is the Chief guest for the audio fuctions. A Guru Raj and Vinod Reddy are the producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X