తెలుగులో యూట్యూబ్ సంచలనం ప్రియా ప్రకాష్ వారియర్ చిత్రం!
కేవలం 27 సెకన్ల వీడియోతో యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన సొగసరి ప్రియా ప్రకాష్ వారియర్. యువకుల్లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ప్రియా నటించిన మలయాళ చిత్రం ఒరు ఆధార్ లవ్. ఈ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతో సుఖీభవ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది. ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి నిర్మాతలు. ఒమర్ లులు ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ సినిమా గురించి నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి మాట్లాడుతూ ఒరు ఆధార్ లవ్ తెలుగు హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు. భారీ పోటీ మధ్య హక్కులను మేం దక్కించుకున్నాం. వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగులో లవర్స్ డే అనే పేరుతో విడుదల చేస్తున్నాం. 2018లో గూగుల్‌లో టాప్‌లో ట్రెండింగ్‌లో ఉన్న అమ్మాయి ప్రియా ప్రకాష్ వారియర్. తన కనుసైగతో ఆమె చేసిన మాయ అంత గొప్పది. తెలుగులోనూ ఆ అమ్మాయికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రియాని హీరోయిన్‌గా పెట్టి తెలుగులో సినిమా చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు.

ప్రియా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ను మేం తెలుగులో విడుదల చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రొమాంటిక్ కామెడీ చిత్రమిది. హై స్కూలు చదివే ఇద్దరి మధ్య రొమాన్స్ ను చెబుతుంది. షాన్ రెహమాన్ సంగీతం హైలైట్ అవుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











