ప్రియా ప్రకాష్ వారియర్ అస్సలు తగ్గట్లేదుగా..డిజాస్టర్స్ ఎదురైనా కూడా అదే దూకుడు

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇటీవల ప్రియా ప్రకాష్ వారియర్ కూడా టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కావడం లేదు గాని ఛాన్సులు మాత్రం గ్యాప్ లేకుండా వస్తున్నాయి.

కను సైగలతో సోషల్ మీడియా ప్రపంచాన్ని కదిలించిన ప్రియా ప్రకాష్ తెలుగులో ఈ మధ్య గ్యాప్ లేకుండా ఆఫర్స్ అందుకుంటోంది. నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో వచ్చిన చెక్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి తెలుగులో కొత్త ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి.

Priya prakash varrier upcoming project with another young hero

తేజ సజ్జతో చేసిన ఇష్క్ సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక యువ హీరో రామ్ తో కూడా మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో కూడా మరో సినిమా స్టార్ట్ చేయవచ్చని టాక్ వస్తోంది. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నట్లు సమాచారం.

ఇక అదే సినిమా కోసం ప్రియా ప్రకాష్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక మరోవైపు మారుతి గోపిచంద్ తో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అనంతరం రామ్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X