నాలో టాలెంట్‌ను బయటకు తీస్తాడు.. అందుకే అతడితో.. థ్రిల్లింగ్‌గా ప్రియా వడ్లమాని

ప్రేమకు రెయిన్ చెక్, శుభలేఖ+లు, హుషారు చిత్రాలతో ఆకట్టుకొన్న ప్రియా వడ్లమాని మరో క్రేజీ ప్రాజెక్టును చేజిక్కించుకొన్నారు. ఇప్పటి వరకు లవ్, రొమాంటిక్ చిత్రాల్లో నటించిన ఈ అందాల భామ ప్రస్తుతం ఓ థ్రిల్లర్ మూవీలో హీరోయిన్‌గా నటించనున్నారు. నటుడు, నిర్మాత, దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించే ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది.

ఈ సినిమా గురించి ప్రియా వడ్లమాని మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను రొమాంటిక్ చిత్రాల్లోనే నటించాను. థ్రిల్లర్ సినిమా అనేది నాకు కొత్త జోనర్. యాక్టర్లలో ప్రతిభను రవిబాబు ఎలా బయటకు తీస్తారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అందుకే ఆయన సినిమాను అంగీకరించాను. నాలోని ప్రతిభను, నటిని కొత్త కోణంలో చూపిస్తారని ఆశిస్తున్నాను అని ప్రియా వడ్లమాని చెప్పారు.

Priya Vadlamani signs Ravi Babus Thriller movie

సినిమాలో నా పాత్ర చాలా కీలకమైనది. నా పాత్ర ద్వారానే సినిమా ముందుకెళ్తుంది. సహజంగా ఉంటుంది. ప్రేక్షకులకు చాలా థ్రిల్ కలిగిస్తుంది. నేను నేర్చుకోవడానికి అవకాశం ఉన్న పాత్ర దొరికింది. కాన్సెప్ట్ బేస్డ్‌ చిత్రంలో నాకు భాగమయ్యే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను అని ప్రియా వడ్లమాని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X