For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అతనితో ప్రియమణి అఫైర్.. ఆ విషయం అప్పుడే తెలుతుందట.. రివీల్ చేసేసింది!

  |

  కన్నడ భామ ప్రియమణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఒకప్పుడు తెలుగులో బడా స్టార్ హీరోలందరితో నటించిన ఈ భామకి పెళ్లి తర్వాత కాస్త అవకాశాలు తగ్గాయి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి గాని ఇతర పాత్రలకు ఆమెను ఎక్కువగానే అప్రోచ్ అవుతున్నారు. అయితే హీరోయిన్ గా కూడా ఆమె సీనియర్ హీరోల పక్కన నటిస్తోంది. ఆమె వెంకటేష్ సరసన నారప్ప సినిమాలో నటిస్తోంది. ఆ విషయం పక్కన పెడితే ఈ భామ తన అఫైర్ గురించి కొన్ని కీలక కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

   మోడల్ టు స్టార్ హీరోయిన్

  మోడల్ టు స్టార్ హీరోయిన్

  ఒక సాధారణ మోడల్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి చేరుకుంది. ఎవరే అతగాడు సినిమా హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ పెళ్లయిన కొత్తలో సినిమాలో జగపతి బాబు సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత ఈమెకు వరుసగా మంచి అవకాశాలు దక్కాయి, దీంతో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా లభించింది.

   తెలుగు వారి ఆదరణ

  తెలుగు వారి ఆదరణ

  ఇక తెలుగు సినిమాతోనే పరిచయమైన ఈ భామ తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. అన్ని భాషల్లో ఈమెకు ఎక్కువగా తెలుగువారే అవకాశాలు ఇచ్చారు అని చెప్పవచ్చు. అలా తెలుగు సినిమాలు చేస్తూ తెలుగు వారికి దగ్గరైన ఈ భామ తమిళ సినిమా పరుత్తి వీరన్ ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

   పెళ్లి తర్వాత కూడా

  పెళ్లి తర్వాత కూడా

  అయితే పెళ్లి తర్వాత కాస్త కెరీర్ సన్నగిల్లింది, హీరోయిన్ పాత్ర రావడం తగ్గిపోయాయి. ప్రస్తుతానికి ఆమె టెలివిజన్ షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తూ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న అసురన్ రీమేక్ సినిమాలో ఆమె సుందరమ్మ పాత్రలో నటిస్తోంది. అలాగే రానా సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాల్లో కూడా ఆమె కామ్రేడ్ భారతక్క పాత్రలో నటిస్తోంది.

  సుచిత్ర పాత్రలో

  సుచిత్ర పాత్రలో

  అయితే అసలు విషయానికి వస్తే ఈ భామ గత ఏడాది చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్ డి.కె జంటగా తెరకెక్కిన ఈ సిరీస్ లో మనోజ్ బాజ్ పేయి భార్యగా సుచిత్ర అనే పాత్రలో నటించింది. తన కుటుంబం ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ లెక్చరర్ ఉద్యోగం కూడా వదిలేసి తన స్నేహితులు ప్రారంభిస్తున్న స్టార్టప్ కంపెనీలో భాగస్వామి అవుతుంది.

  Pawan Kalyan కి COVID19: అసలు హీరో ఉన్నట్టా లేనట్టా? RGV, కాళ్లు పిసుకుతా -Srireddy
   స్నేహితుడితో అఫైర్

  స్నేహితుడితో అఫైర్

  అయితే ఆ స్టార్టప్ కంపెనీ కోసం వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు స్నేహితునితో ప్రియమణి ఎఫైర్ పెట్టుకున్నట్లు వెబ్ సిరీస్ లో బ్రమ కల్పిస్తారు. అది నిజంగా జరిగిందో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ విషయం మీద తాజాగా ప్రియమణి క్లారిటీ ఇచ్చింది. అసలు తనను చాలామంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు అని ఆ సమయంలో అతనితో ఎఫైర్ ఉంటుందా ? ఉండదా ? అని చాలామంది ప్రశ్నించారని ఆమె చెప్పుకొచ్చింది

  అప్పుడే క్లారిటీ

  అప్పుడే క్లారిటీ

  ఈ అంశం మీద ఆమె మాట్లాడుతూ తనకు అతనితో ఎఫైర్ ఉందో ? లేదో ?అనేది సెకండ్ సీజన్ లో క్లారిటీ ఇస్తామని అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అని షాక్ ఇచ్చింది. ఇక సమంత కీలక పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ సెకండ్ సీజన్ జూన్ 4వ తేదీ నుంచి ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రానుంది. మరి ఇంతకీ ఎఫైర్ ఉందా ? లేదా ? అనేది తెలుసుకోవాలంటే అప్పటిదాకా ఆగక తప్పదు

  English summary
  Priyamani who played a key role in Family Man series won solid appreciation in season one. Priyamani plays Manoj Bajpai’s wife and has problems with her husband. makers confused viewers that she had an affair with colleague. actress says that all that will be revealed in the second season and it will surely be quite interesting to see for the audience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X