For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Priyamani ఏదైనా సమస్య ఉంటే.. అది నాకు, నా భర్తకు మధ్యే.. మరొకరికి సమాధానం చెప్పాలా? ఘాటుగా ప్రియమణి

  |

  దక్షిణాదిలోనే కాకుండా హిందీలో రాణిస్తున్న సీనియర్ హీరోయిన్ ప్రియమణి విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో ఆలరిస్తున్నది. ఇటీవల ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, నారప్ప చిత్రాలతో నటిగా మరోసారి రుజువు చేసుకొన్నారు. తాజాగా మరోసారి భామా కలాపం అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ సమర్పించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సినిమా 11వ తేదీన రిలీజ్ సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రియమణి జాతీయ మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ విషయాలను పంచుకొన్నారు. ఈ నేపథ్యంలో ప్రియమణి ఏం చెప్పారంటే..

  భామ కలాపం మూవీలో

  భామ కలాపం మూవీలో

  భామా కలాపం సినిమాలో ప్రియమణి వంటల కార్యక్రమాన్ని నిర్వహించే హోస్ట్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అనుపమ పాత్రలో నటించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌తో సాగే కామెడీ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి అభిమన్యు తాడిమెట్ దర్శకత్వం వహిస్తున్నారు. జస్టిన్ ప్రభాకర్ సంగీతం, దీపక్ యెరగెరా సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. ఈ సినిమా ఆహాలో రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

  హీరోయిన్ల విషయంలో పరిస్థితి మారింది

  హీరోయిన్ల విషయంలో పరిస్థితి మారింది

  భామా కలాపం సినిమా ప్రమోషనల్‌లో భాగంగా ప్రియమణి మాట్లాడుతూ.. హీరోయిన్ల విషయానికి వస్తే పరిస్థితులన్నీ సానుకూలంగా మారాయి. హీరోయిన్లను గ్లామర్ తారలుగా చూసే పరిస్థితి మారిపోయింది. సినిమాలో హీరోయిన్లకు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకుల ఆదరిస్తున్నారు. అలాగే నిర్మాత, దర్శకులు, రచయితలు హీరోయిన్లను దృష్టిలో ఉంచుకొని కథలు రాస్తున్నారు అని ప్రియమణి చెప్పారు.

  అనుపమ పాత్రతో నా జీవితం

  అనుపమ పాత్రతో నా జీవితం

  భామ కలాపం చిత్రంలో అనుపమ పాత్ర గృహిణి, వంటలంటే చాలా ఇష్టం. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన మహిళ. అయితే నిజ జీవితంతో పోల్చితే అనుపమ పాత్రకు నాకు ఎలాంటి పోలీకలు లేవు. నా జీవితానికి కట్టుబడి ఉంటాను. అందులోనే జీవించడానికి సిద్దపడుతాను. ఎప్పుడూ ఇంటి వాతావరణంలో ఉండాలని కోరుకొంటాను. నాకు వంట చేయడం రాదు. నా భర్తనే అన్ని పనులు చేస్తారు. నేను మాత్రం పుష్టిగా భోజనం చేస్తాను అని ప్రియమణి చెప్పారు.

  రూమర్లు, గాసిప్స్‌పై ప్రియమణి

  రూమర్లు, గాసిప్స్‌పై ప్రియమణి

  నా వైవాహిక జీవితానికి సంబంధించి, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి ఎన్నో రూమర్లు, గాసిప్స్ వస్తుంటాయి. కానీ వాటిని డీల్ చేసే పరిస్థితిని అలవాటు చేసుకొన్నాను. అలాంటి వార్తలకు స్పందిస్తే.. ఇంకా వాటికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. వాటిని వదిలేస్తే వాటంతట అవే సర్దుకొంటాయి. వాటికి వివరణ ఇస్తే నేను తప్పు చేసినట్టు అవుతుందని అనుకొంటాను. కానీ కొద్ది రోజులు ఆగితే ఆ రూమర్లకు వాటంతట సమాధానం లభిస్తుంది. సమయమే వాటికి సమాధానం లభిస్తుంది అని ప్రియమణి తెలిపారు.

  నా జీవితంపై వచ్చే ఆరోపణలపై

  నా జీవితంపై వచ్చే ఆరోపణలపై

  తన వైవాహిక జీవితంలో వివాదాస్పద అంశాలపై స్పందిస్తూ.. నా లైఫ్‌లో ఏదైనా జరిగితే నా కుటుంబానికి, లేదా నా భర్తకు సమాధానం చెప్పుకొంటాను. తప్పితే మరొకరికి నేను సమాధానం చెప్పుకొను. ఏదైనా పరిస్థితి చేజారితే.. దానికి సంబంధించిన నష్ట నివారణ చర్యలు తీసుకొంటాను. నా గురించి అవాస్తవాలు మీడియాలో వస్తే వాటిని గాలికి వదిలేస్తాను అని ప్రియమణి చెప్పారు.

  ప్రియమణి సినిమా కెరీర్ ఇలా...

  ప్రియమణి సినిమా కెరీర్ ఇలా...

  ప్రియమణి సినిమా కెరీర్ విషయానికి వస్తే.. భామా కలాపంతోపాటు ఆమె నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. హిందీలో మైదాన్, కన్నడ, తెలుగులో సైనేడ్, కన్నడలో డాక్టర్ 56, తమిళంలో కొటేషన్ గ్యాంగ్, కన్నడలో ఖైమారా, బాలీవుడ్‌లో షారుక్ ఖాన్‌తో అట్లీ రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.

  English summary
  Actress Priyamani about Bhama Kalapam and her marital life with Husband. She said, If something happens, you know what is true and you are answerable only to your family, husband and not to the whole world.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X