ఆ కోరిక ఇంకా తీరలేదు.. నా డ్రీమ్ రోల్ అదే.. ప్రియమణి కామెంట్స్

కేరళకు చెందిన ప్రియమణి.. తమిళం, తెలుగు భాషల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. పరుత్తివీరన్‌ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న ప్రియమణి వివాహానంతరం నటనకు దూరమైంది. సినిమాలకు దూరమైనా, బుల్లితెర ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంది. ఇటీవల వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో వెండితెరకూ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతోంది. ఇలా రియాలటీ షోలు, వెబ్‌ సిరీస్, సినిమాలు అంటూ మళ్లీ బిజీ అయిపోయింది.

తాజాగా వెంకటేష్ సరసన..

తాజాగా వెంకటేష్ సరసన..

తమిళంలో సంచలన విజయాన్ని సాధించిన అసురన్‌ చిత్ర తెలుగు రీమేక్‌లో వెంకటేష్ సరసన నటించే అవకాశం ప్రియమణినే వరించింది. ఈ సందర్భంగా ఈమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటిగా పరిచయమై 17 ఏళ్లు అయిందని.. ఈ పయనాన్ని ఒక్క సారి వెనక్కు తిరిగి చూసుకుంటే సంతోషం కలుగుతోందని తెలిపింది. ఈ కొత్త సంవత్సరం నటిగా తనకు ఇంకా బాగుంటుందనే నమ్మకం ఉందని పేర్కొంది.

ప్రస్తుతం ఫ్యామిలీమ్యాన్ రెండో సీజన్

ప్రస్తుతం ఫ్యామిలీమ్యాన్ రెండో సీజన్

ప్రస్తుతం ది ఫ్యామిలీమ్యాన్ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నానని, ఇందులో సుచిత్రా తివారి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. ముంబాయిలో నివసించే తమిళ అమ్మాయి పాత్ర అనగానే నటించడానికి అంగీకరించినట్లు పేర్కొంది. ప్రస్తుతం సీజన్‌ 2 చిత్రీకరణ జరుగుతోందని, ఇందులో నటి సమంత కూడా పాల్గొననున్నట్లు తెలిపింది.

వైవిధ్యమైన పాత్ర...

వైవిధ్యమైన పాత్ర...


ఇందులో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, కొన్ని సన్నివేశాల్లో తనను పోల్చుకునేలా సన్నివేశాలు ఉన్నాయంది. భార్యాభర్తల మధ్య చాలా సహజత్వానికి దగ్గరగా ఉండేలా సన్నివేశాలు ఇందులో ఉన్నాయని తెలిపింది. నిజ జీవితంలో తనకు తన భర్తకు జరిగే సంఘటనలు ఇలానే ఉంటాయని చెప్పుకొచ్చింది. తానే కాదు అందరూ కనెక్ట్‌ అయ్యేల యధార్థ సన్నివేశాలు చోటు చేసుకున్నాయని చెప్పింది.

అదే డ్రీమ్ రోల్..

అదే డ్రీమ్ రోల్..

తన డ్రీమ్‌ రోల్‌ ఏమిటని చాలా మంది అడుగుతున్నారని, పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర మాదిరి ఒక నెగిటివ్‌ పాత్రనే తన డ్రీమ్‌రోల్‌ అని చెప్పింది. తన వాయిస్‌ నెగిటివ్‌ పాత్రలకు బాగుంటుందని చాలా మంది చెబుతుంటారని పేర్కొంది. అలాంటి పూర్తి స్థాయి ప్రతినాయకి పాత్ర కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. తాను ప్రారంభ దశలోనే భారతీరాజా, బాలుమహేంద్ర వంటి లెజెండ్రీ దర్శకుల చిత్రాల్లో నటించానంది.

ఆ కోరిక ఇంకా తీరలేదు..

ఆ కోరిక ఇంకా తీరలేదు..

అయితే ఇక్కడ తనకుంటూ ఒక స్థానం లభించలేదన్న బాధ ఉందా? అంటే కచ్చితంగా ఉందనే చెబుతానంది. తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటిచాలన్న తన కోరిక తీరలేదని చెప్పింది. ఆ ఆశ ఇప్పటికీ ఉందని అంది. కాగా తమిళంలో జయలలిత బయోపిక్‌గా తెరకెక్కనున్న తలైవి చిత్రంలో శశికళ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోందని, అయితే అది ఇప్పుటికి న్యూస్‌గానే ఉందని, ఇంకా కన్ఫర్మ్‌ కాలేదని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X