సుందరమ్మగా ప్రియమణి.. ‘నారప్ప’ స్పెషల్ విషెస్

నటిగా ప్రియమణి సత్తా ఏంటో యమదొంగ, గోలీమార్ వంటి చిత్రాలను చూస్తే తెలుస్తోంది. అయితే హీరోయిన్‌గా ప్రస్తుతం అవకాశాలు లేకపోయినా బుల్లితెరపై మెల్లిగా నెట్టుకొస్తోంది. అయితే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రియమణి ఫామ్‌లోకి వచ్చింది. తన నటనలోని మరో కోణాన్ని చూపిస్తూ.. అందంలోనే ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ప్రస్తుతం ప్రియమణికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

అయితే మొదట్లో వచ్చినట్టుగా, చేసినట్టుగా కేవలం గ్లామర్ పాత్రలనే ఒప్పుకోవడం లేదు. అందులో ఏదో ఒక కొత్తదనం ఉండాలని భావిస్తోంది. అందుకే విరాటపర్వంలో నక్సలైట్ భారతక్క పాత్రను ఎంచుకుంది. మరోవైపు అసురన్ రీమేక్ అయిన నారప్పలోనూ ఓ అద్భుత పాత్రను పోషించేందుకు సిద్దమైంది. తమిళంలో మంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో ప్రియమణి పోషిస్తోంది.

Priyamani As Sundaramma In Venkatesh Narappa

ఈ రోజు ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా సుందరమ్మ పాత్రను పరిచయం చేశారు నారప్ప చిత్ర యూనిట్. అంతే కాకుండా వెంకటేష్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ప్రియమణి లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. నారప్ప చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తుండగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ మూలానా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే మళ్లీ షూటింగ్ పున: ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X