'సుచి' గురించి సెన్సేషనల్ కామెంట్స్.. అస్సలు వదలలేదు, డైరెక్టర్స్ కు చెప్పినా ఇష్టం లేదని!
ప్రియమణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. ఒకప్పుడు తెలుగులో బడా స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామకి పెళ్లి తర్వాత కాస్త అవకాశాలు తగ్గాయి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో కాస్త గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమెను ఇప్పుడు హీరోయిన్ గా కూడా ఆమె సీనియర్ హీరోల పక్కన నటిస్తోంది. అయితే ఈ భామ ఫ్యామిలీ మ్యాన్ లో తన పాత్ర కొన్ని కీలక కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా
ఒక సాధారణ మోడల్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి వెళ్లింది. ఎవరే అతగాడు సినిమా హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ పెళ్లయిన కొత్తలో సినిమాలో జగపతి బాబు పక్కన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత ఆమెకు వరుసగా మంచి అవకాశాలు దక్కాయి, దీంతో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా లభించింది.

పెళ్లి తర్వాత మళ్ళీ
పెళ్లి తర్వాత ప్రియమణి కాస్త కెరీర్ సన్నగిల్లింది, హీరోయిన్ పాత్ర రావడం తగ్గిపోయాయి. ప్రస్తుతానికి ఆమె టెలివిజన్ షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తూ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న అసురన్ రీమేక్ సినిమాలో ఆమె సుందరమ్మ పాత్రలో నటిస్తోంది. అలాగే రానా సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాల్లో కూడా ఆమె కామ్రేడ్ భారతక్క పాత్రలో నటిస్తోంది.

సుచి పాత్రలో
అయితే అసలు విషయానికి వస్తే ఈ భామ గత ఏడాది చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్ డి.కె జంటగా తెరకెక్కిన ఈ సిరీస్ లో మనోజ్ బాజ్ పేయి భార్యగా సుచి అనే పాత్రలో నటించింది. తన కుటుంబం ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ లెక్చరర్ ఉద్యోగం కూడా వదిలేసి తన స్నేహితులు ప్రారంభిస్తున్న స్టార్టప్ కంపెనీలో భాగస్వామి అవుతుంది.

ఆ ఎఫైర్
అయితే ఆ స్టార్టప్ కంపెనీ కోసం వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు స్నేహితుడితో ప్రియమణి ఎఫైర్ పెట్టుకున్నట్లు వెబ్ సిరీస్ లో భ్రమ కల్పిస్తారు. అది నిజంగా జరిగిందో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ విషయం మీద తాజాగా ప్రియమణి ఆసక్తికర కామెంట్లు చేసింది. మొదటి సీజన్ తర్వాత ఆమెకు ఏదైనా ద్వేషపూరిత మెయిల్ వచ్చిందా అని ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ప్రియమణి మాట్లాడుతూ, "సీజన్ ఒకటి అంతగా లేదు, కానీ సీజన్ రెండు తర్వాత నాకు చాలా హేట్ వచ్చిందని పేర్కొంది.

రోజూ అదే రచ్చ
దాదాపు ప్రతి రోజు, నేను సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా , అందరూ చెప్పే మొదటి విషయం ఏమిటంటే, 'మీరు శ్రీకాంత్‌కు ద్రోహం చేయకూడదు', 'మీరు శ్రీకాంత్‌తో ఇలా చేయకూడదు', 'మీరు శ్రీకాంత్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచారు?'. " ముందు నేను నవ్వేశాను కాని, వారు ఇలా వ్యాఖ్యానించడానికి నేను తప్పక ఏదో ఒకటి చేసి చేయాలని ఆమె చెప్పుకొచ్చింది.

వాళ్ళకు ఇష్టం లేదు
ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ ప్రపంచంలో అత్యంత అసహ్యించుకునే పాత్రలలో సుచి ఒకటి అని ఆమె అన్నారు. సిరీస్ దర్శకులు రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డికెలతో కూడా దీనిపై చర్చించామని, ఈ పరిస్థితిని ముందు బహిరంగంగా పరిష్కరించడానికి ఆలోచించామని, అయితే మళ్ళీ అలా చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. సుచి మరియు అరవింద్ మధ్య ఏమి జరిగిందో ప్రేక్షకులు తెలుసుకోవడం తమకు ఇష్టం లేదని రాజ్ మరియు డికె చెప్పారని ఆమె వెల్లడించారు.


Click it and Unblock the Notifications











