రెండువైపుల పదునున్న కత్తి.. అనుష్క, సమంతపై ప్రియమణి సెన్సేషనల్ కామెంట్

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మెప్పించిన అందాల తార ప్రియమణి మరో కొత్త రంగంలోకి ప్రవేశించింది. డిజిటల్ మీడియా అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్‌లో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తన ముందుకు వచ్చే ప్రతీ అవకాశాన్ని వదులుకోవడం తెలీదు. ఆ క్రమంలో వచ్చిన వెబ్ సిరీస్ అవకాశాన్ని కెరీర్‌కు ఉపయోగించుకొన్నానని చెప్పింది. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మీటూ ఉద్యమం, మహిళా నటీమణులకు ఇస్తున్న రెమ్యునరేషన్ల వివక్షపై ప్రియమణి ధ్వజమెత్తింది.

ప్రియమణి బహిరంగ నిరసన

ప్రియమణి బహిరంగ నిరసన

సినిమా పరిశ్రమలో హీరోలకు, హీరోయిన్లకు మధ్య చెల్లించే రెమ్యునరేషన్ల విషయంలో కొనసాగుతున్న వివక్షపై ప్రియమణి బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. సినిమాకు గొప్పగా పేరు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల రాబట్టినా హీరోయిన్లకు రెమ్యునరేషన్ల విషయంలో న్యాయం జరగడం లేదు. కేవలం హీరోలకే ప్రాధాన్యం ఇస్తున్నారు అని ప్రియమణి ఆవేదన వ్యక్తం చేసింది.

 అగ్రహీరోయిన్లు అనుష్క, సమంత

అగ్రహీరోయిన్లు అనుష్క, సమంత

రెమ్యునరేషన్ల విషయంలో ఇప్పడిప్పుడే పరిస్థితి మారుతున్నది. అనుష్క శెట్టి, నయనతార, సమంత అక్కినేని లాంటి అగ్రశ్రేణి హీరోయిన్లు పారితోషికం విషయంలో నిక్కచ్చిగా ఉంటున్నారు. వారికి రావాల్సిన మొత్తాలను డిమాండ్ చేసి తీసుకోవడం ఇండస్ట్రీకి శుభపరిణామం అని ప్రియమణి అన్నారు.

మీటూతో పరిశ్రమలో అనూహ్య మార్పులు

మీటూతో పరిశ్రమలో అనూహ్య మార్పులు

మీటూపై ప్రియమణి స్పందిస్తూ.. తాను పెద్దగా స్పందించకపోవడానికి కారణాలేమి లేవని చెప్పారు. మీటూతో పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. బాధితులకు మీటూ రెండు వైపులు పదను ఉన్న కత్తి లాంటిది. మీటూతో హీరోయిన్లకు అభద్రతాభావం తొలిగిపోయింది. మీటూ అనేది సినిమా పరిశ్రమకే సంబంధించిందనుకోవడం కేవలం తప్పు అని ప్రియమణి అన్నారు.

మీటూతో అభద్రతభావం తొలిగింది..

మీటూతో అభద్రతభావం తొలిగింది..

మీటూ అనేది చాలా సున్నితమైన అంశం. ప్రతీ ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవద్దు. పలువురు హీరోలపై మీటూ ప్రభావం పెద్ద ఎత్తున పడింది. ఇక నుంచి హీరోయిన్లను, మిళా నటీనటులను చవకబారుగా చూడరు. ఆ విషయంలో మీటూ అంశం విజయం సాధించింది. ఆ విషయంలో కొందరు హీరోయిన్లను, మహిళ నటులను మెచ్చుకోవాల్సిందే అని ప్రియమణి పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X