‘ఆ డైరెక్టర్‌ చేతుల్లో మోసపోయా... నాతో బికినీ వేయించి అలాంటి సీన్’

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు ప్రియమణి. డస్కీ బ్యూటీగా కుర్రాళ్లకు సెగలు రేపిన ప్రియమణి.. యంగ్ హీరోయిన్‌లకు పోటీగా దూసుకెళ్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల సరస్వతి మూవీతో ప్రేక్షకులను పలకరించిన ప్రియమణి.. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

2003లో ఎవరే అతగాడు అనే తెలుగు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు ప్రియమణి. ఆ తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. రామ్, పుతియా ముఖం, రావణన్, పృథ్వీరన్, తిరక్కథ, చారులత, ఇడోల్లే రామాయణ, జవాన్, ఆర్టికల్ 370, ఆఫీసర్ ఆన్ డ్యూటీ తదితర సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డ్‌తో పాటు ఫిలింఫేర్ తదితర అవార్డులను సొంతం చేసుకున్నారు.

Priyamani Opens Up About Wearing Bikini in Drona Movie Says I Was Scared at First

కెరీర్ పీక్స్‌లో ఉండగానే ముస్తాఫా రాజ్‌తో ప్రేమలో పడిన ప్రియమణి ఆయనను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయినప్పటికీ వరుసపెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఓటీటీలు, టెలివిజన్‌లోనూ ఇరగదీస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమెకు మంచి పాత్రలు వస్తున్నాయి. ది ఫ్యామిలీ మెన్ వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హిస్ స్టోరీ, గుడ్ వైఫ్ వెబ్ సిరీస్‌లు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. బుల్లితెరపై పలు రియాలిటీ షోలకు జడ్జిగానూ అలరించారు. ప్రస్తుతం ఆమె నటించిన జన నాయగన్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇది కాకుండా జీడీఎన్, గోల్‌మాల్ సినిమాలలో ప్రియమణి నటిస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సరస్వతి మూవీలో ప్రియమణి కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి, వరలక్ష్మీలు కలిసి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కెరీర్ తొలినాళ్లలో ద్రోణ సినిమాలో బికినీ ధరించడంపై ప్రియమణిని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఆమె తనదైన శైలిలో స్పందించారు. బికినీ ధరించడం తప్పు కాదని, కథకు తగినట్లుగా, ఆ పరిస్థితులకు అనుగుణమైన దుస్తులు ధరించాల్సిందే. స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంటే అప్పుడు చీర, జీన్స్ వంటివి ధరించలేం కదా. అలాంటప్పుడు బికినీ ధరించకతప్పదు అని ప్రియమణి తెలిపారు.

తొలుత ఈ సీన్ చేయడానికి కాస్త భయపడ్డాను. అయితే ఆ చిత్ర దర్శకుడు నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అప్పట్లో తషన్ సినిమాలో కరీనా కపూర్ బికినీ ధరించిన సీన్ వైరల్ కావడంతో తనను కూడా అలాగే డిఫరెంట్‌గా చూపిస్తానని చెప్పాడు. అప్పటి వరకు నేను ఏ సినిమాలోనూ బికినీ, స్విమ్ సూట్ లాంటివి వేసుకోలేదు. దాంతో ఒకసారి ట్రై చేద్దామని ఓకే చెప్పా. ఈ సీన్ తర్వాత నాపై చాలా కామెంట్స్ వచ్చాయి.. ఎంతో ట్రోలింగ్ జరిగింది. అప్పటి వరకు సాధారణ పాత్రలు చేసిన నన్ను.. ప్రేక్షకులు కొత్తగా చూడటంతోనే ఇలా జరిగింది. నటిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్ధితి వస్తే బికినీ ధరించాల్సిందే. అలాగని మన కంఫర్ట్‌ని పక్కన పెట్టకూడదు. ఇప్పుడు బికినీ వేసుకోమంటే మాత్రం చేయనని ప్రియమణి తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: priyamani saraswathi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X