పెళ్లి తర్వాత భర్తతో గొడవలు.. బొండాం ఆంటీ అంటూ.. షాకింగ్ విషయాలు బయట పెట్టిన ప్రియమణి!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ప్రియమణి ఇప్పుడు క్రేజ్ తగ్గిపోవడంతో సీనియర్ హీరోల పక్కన అలాగే వెబ్ సిరీస్ లలో నటిస్తూ కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనల్ లైఫ్ అలాగే పెళ్లి తర్వాత తన జీవితం గురించి సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

Recommended Video

Family Man 2 రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలు, రంగంలోకి TN Govt || Filmibeat Telugu
ఎవరే అతగాడు అంటూ

ఎవరే అతగాడు అంటూ

తెలుగులో ఎవరే అతగాడు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో సినిమాతో బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించి, ఆతర్వాత చానాళ్ళ పాటు తెలుగులో దాదాపు అందరు హీరోలతో నటించింది. ఇక ఈ భామ ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ప్రేమ వివాహం చేసుకుని సెటిల్ అయింది. ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లాడిన ప్రియమణి ఇప్పుడు మళ్లీ సినిమా అవకాశాలతో బిజీ అవుతోంది.

పెళ్లి తర్వాత అలా

పెళ్లి తర్వాత అలా

పెళ్లి తర్వాత లైఫ్ గురించి ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భర్త చాలా సపోర్టింగ్ వ్యక్తి అని అలాంటి భర్త తనకు దొరకడం అదృష్టం అని ఆమె వెల్లడించింది. అయితే అందరి భార్య భర్తలు అలాగే తమ మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కానీ ఆ సమయంలో ముస్తఫా తగ్గి తనను బుజ్జగిస్తాడని ఆమె తన సీక్రెట్స్ బయట పెట్టింది.

బొండాం, ఆంటీ అంటూ

బొండాం, ఆంటీ అంటూ

ఇక సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పెళ్లయ్యాక తాను కాస్త బరువు పెరగడంతో అందరూ తనను ఆంటీ అని బ్లాకీ అని ఓల్డ్ అని రకరకాల కామెంట్స్ చేసేవారని చెప్పుకొచ్చింది. పెళ్లయ్యాక కాస్త బరువు పెరగడంతో చాలా మంది తనను బోండాం అని లావుగా ఉన్నావ్ అని కామెంట్ చేయడం తాను చూశానని చెప్పుకొచ్చింది. అలా అన్న వాళ్లు ఇప్పుడు మళ్లీ సన్నగా అయ్యావు అని చెబుతున్నారని అసలు మరొకరి శరీరం గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయని ఆమె ప్రశ్నించింది.

అది టాప్ సీక్రెట్

అది టాప్ సీక్రెట్

ఇక ఆమె కీలక పాత్రలో నటించిన ఫ్యామిలీ మాన్ సీజన్ వన్ లో అరవింద్ సుచిత్ర పాత్రల మధ్యలో లోనావాలాలో ఏం జరిగింది అనే విషయం అడిగితే ఆ విషయం మాత్రం చెప్పలేనని ఆమె చెప్పుకొచ్చింది. అది ఒక టాప్ సీక్రెట్ అని ఆమె పేర్కొంది. ఇక ప్రస్తుతం దర్శకనిర్మాతలు మైండ్సెట్ కూడా చాలా మారిందని పేర్కొన్న ప్రియమణి పెళ్లయిన హీరోయిన్లకు కూడా అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఇక ప్రియమణి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రానా హీరోగా రిలీజ్ అవుతున్న విరాటపర్వం సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇక హిందీలో కూడా అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కబోతున్న మైదాన్ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X