సీనియర్ నటికి పోటీగా సాయి పల్లవి కొట్లాట.. మామూలుగా ఉండదట?
ఫిదా సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ సాయి పల్లవి. గ్లామర్ పాత్రల్లో నటించకపోయినా కూడా అమ్మడు కాజల్, సమంతల రేంజ్ లో అభిమానుల్ని సంపాదించుకుంది. సాయి పల్లవికి ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా కేవలం తనకు ఇష్టమైన కథలను మాత్రమే ఎంచుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి విరాటపర్వం సినిమా మాత్రం చాలా స్పెషలట.
వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి లీడ్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రానా కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మాజీ నక్సలైట్ పాత్రలో సాయి పల్లవి చాలా న్యాచురల్ గా సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో సాయి పల్లవికి ధీటుగా ఉండే మరో పాత్ర కోసం సీనియర్ నటి ప్రియమణిని సెలక్ట్ చేసుకున్నారు.

ఆమె కూడా ఒక నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి సినిమాలో నట విశ్వరూపాన్ని చూపించనుందట. సాయి పల్లవికి పోటీని ఇచ్చే విధంగా ఉద్యమంలో ఆమె పోరాట పటిమ కనిపిస్తుందని అలాగే వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ మామూలుగా ఉండవని టాక్ వస్తోంది. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ప్రస్తుతం కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











