రానా సినిమాలో కీలక పాత్రలో హీరోయిన్ ప్రియమణి!
విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ రానా దూసుకుపోతున్నాడు. బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలలో నటిస్తూ అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలు అందిస్తున్నాడు. ఈ ఏడాది రానా నీదీ నాదీ ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విరాటపర్వం 1992 అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో విషయం ఆసక్తిని రేపుతోంది.
రానా సరసన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుంది. సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది. యమదొంగ, పెళ్ళైన కొత్తలో, హరే రామ్ లాంటి హిట్ చిత్రాలతో ప్రియమణి తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. వివాహం తర్వాత ప్రియమణి వెండితెరకు దూరమైంది.

బుల్లితెరలో కొన్ని టీవీ షోలలో ప్రియమణి పాల్గొంటోంది. ఎట్టకేలకు ప్రియమణి నటిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విరాటపర్వం చిత్రంలో ప్రియమణి టబుతో పాటు మానవ హక్కులపై పోరాటం చేసే కార్యకర్తగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేణు ఊడుగుల డిజైన్ చేసిన పాత్ర నచ్చడంతో ప్రియమణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.


Click it and Unblock the Notifications











